Begin typing your search above and press return to search.

శ్రీ‌దేవి - విజ‌య‌శాంతికే త‌ప్ప‌లేదు మ్యాడమ్!

By:  Tupaki Desk   |   25 Feb 2020 4:45 AM GMT
శ్రీ‌దేవి - విజ‌య‌శాంతికే త‌ప్ప‌లేదు మ్యాడమ్!
X
యువ క‌థానాయిక మెహ్రీన్ ఫీర్జ‌దా.. ఐరా క్రియేష‌న్స్ మ‌ధ్య విభేధాల గురించి తెలిసిందే. ఈ భామ స్టే చేసిన హోట‌ల్ కి బిల్లు క‌ట్ట‌లేదంటూ ప్ర‌చార‌మైంది. మెహ్రీన్ వ్య‌వ‌హారంపై నిర్మాత‌లు సీరియ‌స్ గా ఉన్నార‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం హోరెత్తింది. అయితే దీనిపై మెహ్రీన్ సోష‌ల్ మీడియా ద్వారా వివ‌ర‌ణ ఇచ్చింది.

ప్ర‌చారం కోసం ఏర్పాటు చేసిన హోట‌ల్ బ‌స‌కు సంబంధించిన బిల్లుల్ని త‌న మేనేజ‌ర్ చెల్లించార‌ని.. నిర్మాత‌లు చెల్లించ‌ని ప‌క్షంలో తానే ఆ డ‌బ్బును ఏర్పాటు చేశాన‌ని మెహ్రీన్ చెప్పుకొచ్చింది. తాతగారికి గుండెపోటు రావడం హైదరాబాద్ రావ‌డం ఆలస్యమైంది. ఈ విషయాన్ని నా సహనటుడు నాగ శౌర్య ఇంటర్వ్యూల్లో చెప్పారు కూడా. తిరిగి వచ్చిన తర్వాత నేను అశ్వథామ కోసం అన్ని ప్రమోషన్లలో పాల్గొన్నాను. నాకు స్కిన్ అలెర్జీ వ‌ల్ల ఒక ఇంటర్వ్యూలో పాల్గొనలేకపోయాను. నా ఆరోగ్య స‌మ‌స్య‌కు సంబంధించిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్- ఫోటోను నిర్మాతలకు పంపి నిర్మాత‌ల్ని క్షమాపణ కోరాను. అయినా నిర్మాతలు నా హోటల్ బిల్లును కట్టలేదు. నా వ్య‌క్తిగ‌త‌ సిబ్బందికి కూడా వేతనాలు చెల్లించలేదు. నేను కోరిన తర్వాత ఆ హోటల్ బిల్లులు సిబ్బంది బిల్లులు చెల్లించారు`` అని తెలిపింది. మీడియాలో త‌ప్పుడు ప్ర‌చారం సాగింద‌ని .. 14 సినిమాల‌కు ప‌ని చేస్తే ఎప్పుడు ఇలాంటి స‌మ‌స్య‌లు రాలేదు అంటూ వాపోయింది.

ఒక టాబ్లాయిడ్ ఆర్టికల్ లో నా హోటల్ బిల్లులు.. తిండి లాండ్రీ బిల్లులు ప్రస్తావించం చాలా ఇబ్బందిగా అనిపించింది. కాస్ట్యూమ్ డిజైన‌ర్ కి పారితోషికం నేను చెల్లించ‌లేద‌ని రాశారు. అయితే అది నిర్మాణ సంస్థ‌నే చెల్లిస్తుంద‌న్న అంగీకారం ఉంది. ప్ర‌తి వార్త‌కు రెండో కోణం ఉంటుంది.. న‌న్ను కించ‌ప‌రిచినందుకే ఈ వివ‌ర‌ణ‌`` అని తెలిపింది.

మెహ్రీన్ లేఖాస్త్రానికి ట్విట్ట‌ర్ లో స్పందించిన అభిమానులు.. కొంద‌రు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఒక అభిమాని అయితే శ్రీ‌దేవి- విజ‌య‌శాంతి లాంటి స్టార్లకే ఇలాంటి తిప్ప‌లు త‌ప్ప‌లేదు. నిర్మాణ సంస్థ‌లు బిల్లులు ఎగ్గొట్ట‌డం కామ‌న్ గా జ‌రుగుతున్న‌దే. మీకు మా వంతు స‌పోర్ట్ ఉంటుంది మ్యాడ‌మ్! అంటూ అభిమానులు స‌పోర్ట్ గా నిలిచారు. ఇలాంటి గాసిప్పుల్ని న‌మ్మ‌లేం అని కూడా కొంద‌రు అభిమానులు అండ‌గా నిలిచారు. న‌ర్త‌న‌సాల స‌మ‌యంలో వెబ్ సైట్ల ప్ర‌చారంపైనా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు కొంద‌రు.

అశ్వ‌థ్థామ సినిమా కోసం మెహ్రీన్‌ కు రూ. 65 లక్షల పారితోషికం ఫిక్స్ చేసి రూ. 55 లక్షలు రిలీజ్ ముందే నిర్మాణ సంస్థ చెల్లించింది. మిగతా రూ. 10 లక్షల సినిమా ప్రమోషన్స్ అయిపోయాక చెల్లించేలా ఒప్పందం కుదిరింద‌ట‌. తాజా వివాదం నేప‌థ్యం లో ఆ 10ల‌క్ష‌ల చెల్లింపులు జ‌రిగాయా? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చా సాగుతోంది.