Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ః కాబోయే వాడితో వెడ్డింగ్ ఫోజ్‌ ఇచ్చేసిన 'ఎఫ్' బ్యూటీ

By:  Tupaki Desk   |   9 March 2021 7:36 AM GMT
పిక్ టాక్‌ః కాబోయే వాడితో వెడ్డింగ్ ఫోజ్‌ ఇచ్చేసిన ఎఫ్ బ్యూటీ
X
ఎఫ్‌ 2 సినిమాలో వరుణ్‌ తేజ్‌ కు జోడీగా నటించి ప్రస్తుతం ఎఫ్‌ 3లో మళ్లీ వరుణ్ తో జత కట్టిన ముద్దుగుమ్మ మెహ్రీన్‌ కౌర్ త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్న విషయం తెల్సిందే. ఈ అమ్మడు భవ్యా బిష్ణోయ్ ను వివాహం చేసుకోబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. వీరిద్దరు బయట చెట్టా పట్టాలేసుకుని తిరుగుతూ ఫొటోలను షేర్‌ చేస్తున్నారు. ఇటీవల వీరిద్దరు జంటగా ఒక ప్రైవేట్ ఈవెంట్‌ లో పాల్గొన్నారు. ఆ సందర్బంగా ఈ క్యూట్‌ కపుల్‌ పెళ్లి జంట మాదిరిగా ఫొటోలకు ఫోజ్‌ లు ఇచ్చి అక్కడున్న వారందరి దృష్టిని ఆకర్షించారు.

పెళ్లికి ముందే వీరు వెడ్డింగ్ ఫొటో షూట్‌ చేసుకున్నట్లుగా ఈ ఫొటో ఉందని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. మెహ్రీన్‌ అందమైన డ్రస్‌ తో పాటు భవ్యా బిష్ణోయ్ కూడా పెళ్లి కొడుకు మాదిరిగా ముస్తాబు అవ్వడంతో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారా ఇప్పటికే అన్నట్లుగా నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోలో వారిద్దరిని చూస్తుంటే ఇప్పటికే వారిద్దరికి పెళ్లి అయ్యి ఉంటుందేమో అనుకునే వారు కూడా చాలా మంది ఉన్నారు. మెహ్రీన్‌ హీరోయిన్‌ గా ఆశించిన స్థాయిలో ఆఫర్లు రాకపోవడంతో పెళ్లికి సిద్దం అయినట్లుగా అనుకుంటున్నారు. అయితే పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తానంటూ మెహ్రీన్‌ సన్నిహితుల వద్ద అంటుందట.