Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: హ‌నీ ఈజ్ ది బెస్ట్.. ఎందుకంటే?

By:  Tupaki Desk   |   20 April 2020 10:00 AM IST
ఫోటో స్టోరి: హ‌నీ ఈజ్ ది బెస్ట్.. ఎందుకంటే?
X
లాక్ డౌన్ వేళ భామ‌లంతా ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ జిమ్ యోగాను అస్స‌లు మిస్ చేయ‌డం లేదు. ఇంటి ప‌ని..వంట‌ప‌ని...ఒంటిప‌ని అంటూ అన్నింటిని చుట్టే బెట్టేస్తున్నారు. షూటింగ్ లు లేక‌పోతే బ‌ద్ధ‌కిస్తార‌ని అనుకుంటే భామ‌లంతా ఫిట్ నెస్ ని పెంచుకునే ప‌నిలో ప‌డ్డారు. మెజారిటీ భాగం యోగా‌పైనే ఏకాగ్ర‌త పెడుతున్నారు. వేస‌వి కావ‌డంతో జిమ్ము కంటే యోగాస‌నా‌లే ఉత్త‌మ‌మ‌ని భావిస్తున్నారు. ఈ గ్యాప్ లో రూప లావణ్యం చెక్కు చెద‌ర‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతున్నారు. తాజాగా బొద్దుగ్గుమ్మ మెహ‌రీన్ ఫిర్జ‌దా కూడా యోగాపై దృష్టి సారించింది. ఇంటినే యోగాశ్ర‌మంగా మార్చేసింది అమ్మ‌డు. శ‌రీరాన్ని విల్లులా వంచి చ‌క్రాస‌నం వేసింది.

ఇన్ స్టా గ్రామ్ లో అభిమానుల‌కు షేర్ చేయగానే అలా జెట్ స్పీడ్ తో వైర‌ల్ అయిపోయింది. లాక్ డౌని ఇలా మంచి ప‌నికి కేటాయించాన‌ని మెహ్రీన్ చెప్ప‌క‌నే చెప్పిందిలా. ప్రస్తుతం ఆ ఫోటో అభిమానుల్ని ఆక‌ట్టుకుంటోంది. టాలీవుడ్ కి వ‌చ్చిన కొత్త‌లో అమ్మ‌డు మ‌రీ బొద్దుగా ఉండేది కాదు. వ‌రుసగా రెండు..మూడు సినిమాల్లో న‌టించేస‌రికి బాగా ఒళ్లు చేసింది. దీంతో బొద్దుత‌నం త‌గ్గాలంటూ విమ‌ర్శ‌లెదుర్కొంది. దీంతో ఆ ట్యాగ్ ను ఎలాగైనా చెరుపుకోవాల‌ని అప్ప‌టి నుండి క‌ఠిన వ్యాయామాలు చేస్తోంది.

లాక్ డౌన్ వేళ అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శిస్తే పాత రూపం వ‌చ్చేస్తుంద‌ని భ‌య‌మో ఏమో? అందుకే ఇలా దొరికిన ఖాళీ స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేస్తూ స‌‌న్న‌జాజిలా త‌యార‌య్యే ప్ర‌య‌త్నం చేస్తుంది. కెరీర్ సంగ‌తి చూస్తే.. ప్ర‌స్తుతం చేతిలో సినిమా అవ‌కాశాలు కూడా లేవు. ఆ మ‌ధ్య యంగ్ హీరో నాగ‌శౌర్య స‌ర‌స‌న అశ్వ‌థ్థామ లో న‌టించింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిలైంది. త‌దుప‌రి సినిమా ఏమిటా? అని వెయిట్ చేస్తున్న టైమ్ లో క‌రోనా లాక్ డౌన్ ముంచుకొచ్చింది. షూటింగ్ లు అన్ని బంద్ అవ్వ‌డంతో ప్ర‌స్తుతానికి మెహ్రీన్ స్వీయ నిర్బంధ‌నంలోనే ఉంది. ఇప్ప‌టికిలా సోష‌ల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు ట‌చ్ లో ఉంది.