Begin typing your search above and press return to search.
భోళా శంకర్ పై 'అతడు' కామెంట్స్!
By: Tupaki Desk | 13 July 2023 6:19 PM ISTమెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత భోళా శంకర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. వాల్తేరు వీరయ్య హిట్ అవ్వడంతో భోళా శంకర్ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉండటం చాలా కామన్ విషయం. ఇటీవలే భోళా శంకర్ సినిమా టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
చిరు భోళా శంకర్ టీజర్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసలు దక్కాయట. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ తెలియజేశాడు. భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న విడుదల కాబోతుంది. సినిమా ప్రమోషన్ లో భాగంగా దర్శకుడు మెహర్ రమేష్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భోళా శంకర్ టీజర్ చూసిమహేష్ బాబు ఫోన్ చేశారు. టీజర్ పై తన ఆసక్తిని తెలియజేశారు. అంతే కాకుండా టీజర్ లో ఉన్న మహతి స్వరసాగర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని ప్రశంసించారు అంటూ మెహర్ రమేష్ తన ఆనందాన్ని పంచుకున్నాడు. మహేష్ బాబు టీజర్ ను నచ్చడంతో విడుదలైన తర్వాత చూసే అవకాశాలు కూడా ఉన్నాయి.
మహేష్ బాబు.. మెహర్ రమేష్ అత్యంత సన్నిహితులుగా పేరు పడింది. ఇద్దరి కాంబోలో సినిమా వచ్చి అట్టర్ ఫ్లాప్ అయింది. అయినా కూడా ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగానే భోళా శంకర్ సినిమా టీజర్ గురించి మహేష్ బాబు స్పందించారు.
భోళా శంకర్ సినిమా సక్సెస్ అయితే దర్శకుడు మెహర్ రమేష్ తనకు ఉన్న పరిచయాలతో మహేష్ బాబు మొదలుకుని ఎంతో మంది స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకోవచ్చు. మరి భోళా శంకర్ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.