Begin typing your search above and press return to search.

బిల్లా ఒక 'కల్ట్ క్లాసిక్' అంటున్న మోహర్ రమేష్..!

By:  Tupaki Desk   |   22 Oct 2022 10:43 AM GMT
బిల్లా ఒక కల్ట్ క్లాసిక్ అంటున్న మోహర్ రమేష్..!
X
సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ అనే సంగతి అందరికీ తెల్సిందే. అయితే ఒక్కో స్టార్ ది ఒక్కో సెంటిమెంట్. తమకు కలిసొచ్చే జోడి, దర్శకుల కాంబినేషన్, విడుదల తేది, పూజా కార్యక్రమాలు, తదితర సెంటిమెంట్లను స్టార్స్ నమ్ముతుంటారు. ఈ కాంబినేషన్ తమ సినిమాలో ఏదో ఒకరకంగా ఉండేలా చూసుకుంటూ ఉంటారు.

అయితే ఈ సెంటిమెంట్స్ అన్నివేళలా ఒకేలా పని చేయకపోయినా.. మెజార్టీ ఫలితాలు మాత్రం వారికి అనుకులంగా వస్తున్నాయి. దీంతో ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతూ వస్తోంది. ఈ సంగతి అంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నామంటే ఈకింది మ్యాటర్ చదవాల్సిందే..!

దర్శకుడు-హీరో, హీరో-హీరోయిన్స్ కాంబినేషన్లో కలిస్తే పక్కా హిట్ కొట్టడం ఖాయమనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది. ఈ కాంబినేషన్ వర్కౌట్ అయిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. కేవలం కాంబినేషన్ తోనే హిట్టు కొట్టిన దర్శకులు అనేకమంది ఉన్నారు. కాగా కొంతమందికి లక్ కలిసిరాగా మరికొంతమందికి మాత్రం నిరాశే ఎదురవుతోంది.

ఇలాంటి దర్శకుల లిస్టులో మొదటి వరుసలో నిలిచిది మాత్రం మోహర్ రమేష్ ఒకరు. రేపు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా 'బిల్లా' మూవీ రీ రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలోనే ఈ మూవీని తెరకెక్కించిన మోహర్ రమేష్ తాజాగా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

'బిల్లా' కథ కంటే కూడా పవర్ ఫుల్ స్టోరీ తన వద్ద ఉందని చెప్పాడు. అయితే ప్రభాస్ కోరిక మేరకు 'బిల్లా'లో అతడిని చాలా స్టైలీష్ గా చూపించామన్నాడు. ప్రభాస్ ను ప్రేక్షకులకు మరింత దగ్గర చేయాలనే ఉద్దేశంతో ఈ మూవీని చాలా స్టైలీష్ గా తెరకెక్కించినట్లు తెలిపారు. ఈ సినిమా తర్వాతే 'మగధీర' 'కిక్కు' లాంటి స్టైలీష్ సినిమాలు వచ్చాయన్నారు.

కాగా అప్పట్లోనే 'బిల్లా' ప్రేక్షకులకు మంచి కిక్కును పంచిందని మోహన్ రమేష్ తెలిపారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా 'బిల్లా' మూవీ టాలీవుడ్లో కల్ట్ క్లాసిక్ గా మిగిలిందన్నారు. తాజాగా ఈ సినిమా మరోసారి రీ రీలీజు కానుండటంతో మోహర్ రమేష్ తనదైన శైలిలో 'బిల్లా'ను ప్రమోట్ చేస్తున్నారు.

ఇకపోతే మెహర్ రమేష్ స్టార్ హీరోలతో చేసిన సినిమాలన్నీ ప్లాప్ అనే ముద్ర వేయించుకున్నారు. కంత్రి, షాడో, శక్తి లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్లుగా మిగిలింది. దీంతో మోహర్ రమేష్ సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా మెగాస్టార్ చిరంజీవితో 'బోళా శంకర్' మూవీ చేసే ఛాన్స్ దక్కించుకున్నారు.

ఈ మూవీతోనైనా మెహర్ రమేష్ హిట్ ట్రాక్ పడుతారా? లేదంటే పాత సెంటిమెంట్ నే రిపీట్ చేస్తారా? అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.