Begin typing your search above and press return to search.

వీడియో : బిగ్ బాస్ బ్రదర్స్ నాటు నాటు డాన్స్‌

By:  Tupaki Desk   |   14 Nov 2021 5:04 AM GMT
వీడియో : బిగ్ బాస్ బ్రదర్స్ నాటు నాటు డాన్స్‌
X
జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఆర్ ఆర్‌ ఆర్ సినిమా సందడి మొదలైంది. సంక్రాంతికి ముందు రాబోతున్న ఈ సినిమా నుండి ఇటీవలే నాటు నాటు వీర నాటు పాట వచ్చింది. ఆ పాటలో ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ ల డాన్స్ కు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. స్వయంగా యూట్యూబ్‌ ఇండియా అఫిషియల్ టీమ్ కూడా వీరి డాన్స్ ను 0.5 స్పీడ్ తో పెట్టి చూసినా కూడా ఇంకా స్పీడ్ గానే అనిపిస్తుంది అంటూ పోస్ట్‌ పెట్టడం జరిగింది. అంతగా వైరల్ అవుతున్న డాన్స్ స్టెప్పులను ఎప్పటిలాగే సోషల్ మీడియాలో తెగ రీల్స్ చేస్తున్నారు. ఆ డాన్స్ స్టెప్పులను మ్యాచ్ చేసేందుకు కొన్ని వేల మంది ప్రయత్నిస్తున్నారు. అన్ని భాషల వారు కూడా ఆయా భాషల నాటు నాటు డాన్స్ స్టెప్పులను అనుకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బిగ్ బాస్ బ్రదర్స్ గా గుర్తింపు దక్కించుకున్న సోహెల్ మరియు మెహబూబ్‌ లు ఈ పాటకు డాన్స్ చేశారు.

పాటలో ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌ లు ఎలాంటి కాస్ట్యూమ్స్ అయితే ధరించారో అలాంటి కాస్ట్యూమ్స్ ను వీరు ధరించి డాన్స్ చేశారు. ఒరిజినల్ స్పీడ్ ను మ్యాచ్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. వీరి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఎంతో మంది ఈ పాటకు డాన్స్ చేశారు కాని వీరు చేసిన ఈ డాన్స్ మాత్రం చాలా స్పెషల్‌ గా నిలిచిందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. డాన్స్ మాత్రమే కాకుండా కాస్ట్యూమ్స్ ను కూడా మ్యాచ్ చేసేందుకు వీరు చేసిన ప్రయత్నం అభినందనీయం. ఈ ఇద్దరు సోషల్‌ మీడియాలో ఈ వీడియోతో ట్రెండ్ అవుతున్నారు. లక్షల కొద్ది లైక్స్ వస్తున్న ఈపాటకు కోట్ల కొద్ది వ్యూస్ వస్తున్నట్లుగా సోషల్‌ మీడియా విశ్లేషకులు తెలియజేస్తున్నారు.

బిగ్ బాస్ గత సీజన్ తో మంచి గుర్తింపు దక్కించుకున్న వీరిద్దరు వరుసగా ప్రాజెక్ట్‌ లతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా సోహెల్‌ హీరోగా మిస్టర్ ప్రెగ్నెంట్‌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. ఇక మెహబూబ్ ఇప్పటికే గుంటూరు మిర్చి అనే వెబ్‌ సిరీస్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. వీరిద్దరు కలిసి సినిమాల్లో కూడా నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమాను సంక్రాంతికి జనవరి 7న విడుదల చేయబోతున్నారు. తెలుగు తో పాటు పలు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను కూడా విడుదల చేస్తారని తెలుస్తోంది. అల్లూరి సీతారామ రాజు మరియు కొమురం భీమ్ పాత్రలతో పూర్తిగా కల్పిత కథతో ఈ సినిమాను రూపొందించినట్లుగా జక్కన్న మొదటి నుండే చెబుతున్నాడు.