Begin typing your search above and press return to search.

యాక్ష‌న్ కింగ్ ఫ్యామిలీ నుంచి బుల్లి హీరో ఇత‌డే!

By:  Tupaki Desk   |   2 Jun 2021 12:30 PM GMT
యాక్ష‌న్ కింగ్ ఫ్యామిలీ నుంచి బుల్లి హీరో ఇత‌డే!
X
యాక్ష‌న్ కింగ్ అర్జున్ కుటుంబం నుంచి వ‌చ్చిన న‌వ‌త‌రం హీరో చిరంజీవి స‌ర్జా. క‌న్న‌డ‌లో 11ఏళ్ల కెరీర్ లో 20 పైగా చిత్రాల్లో న‌టించిన అత‌డు క‌థానాయిక మేఘ‌నా రాజ్ ని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఈ జంట ఇటీవ‌లే పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. అయితే ఆక‌స్మిక గుండె పోటుతో చిరంజీవి స‌ర్జా మృతి చెంద‌డం ఆ కుటుంబంలో క‌ల్లోలం రేపింది.

ప్ర‌స్తుతం కుమారునితోనే మేఘ‌న లైఫ్ ముందుకు సాగుతోంది. వార‌సునితో మ‌ధుర జ్ఞాప‌కాల్ని మేఘ‌న స్వ‌యంగా సోష‌ల్ మీడియాల ద్వారా పంచుకుంటున్నారు. తాజాగా మేఘన రాజ్ జూనియర్ చిరు కి సంబంధించిన అన్ సీన్ ఫోటోను పంచుకున్నారు. జూనియర్ చిరుకు మే 22 తో ఏడు నెలలు నిండాయి. తన ఏడు నెలల కుమారుడి ఫోటోలు వీడియోలను తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో తరచుగా పంచుకునే మేఘ‌నా స్పెష‌ల్ ఫోటోని షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది.

మేఘనా- జూనియర్ చిరు -చిరంజీవి సర్జాల‌కు సంబంధించిన ఫోటోగ్రాఫ్ ల బంచ్ ను అభిమానులు ఈ సంద‌ర్భంగా వైర‌ల్ చేస్తున్నారు. చిరంజీవి సర్జా 2020 జూన్ 7 న భారీ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. భర్త చనిపోయినప్పుడు మేఘనా రాజ్ ఐదు నెలల గర్భవతి. వాయుపుత్ర చిత్రంతో 2009లో కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చిరంజీవి స‌ర్జా.. సంహార- ఆద్య- ఖాకీ - సింగ- అమ్మా ఐ లవ్ యూ- ప్రేమ బరాహ- దండం దశగుణం- వరదనాయక వంటి విజ‌యంత‌మైన చిత్రాల్లో న‌టించారు. యాక్ష‌న్ కింగ్ కుటుంబం నుంచి ధృవ్ స‌ర్జా హీరోగా కెరీర్ సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే.