Begin typing your search above and press return to search.

మేఘన్ తో బెడ్ షేర్ చేసుకున్నట్లు చెబితే ఆ నటుడికి రూ.50లక్షలు ఇస్తామన్నారట!

By:  Tupaki Desk   |   20 March 2022 5:30 PM GMT
మేఘన్ తో బెడ్ షేర్ చేసుకున్నట్లు చెబితే ఆ నటుడికి రూ.50లక్షలు ఇస్తామన్నారట!
X
మేఘన్ మార్కెల్ పేరు చాలామందికి సుపరిచితమే. అదేనండి బ్రిటన్ నటిగా పరిచితురాలు.. ప్రిన్స్ హ్యారీని పెళ్లాడటం ద్వారా అందరికి సుపరిచితురాలైన ఆమెకు సంబంధించిన సంచలన విషయం తాజాగా బయటకు వచ్చింది. ప్రిన్స్ హ్యారీతో ఆమె రిలేషన్ షిప్.. వారిద్దరి పెళ్లిని చెడగొట్టేందుకు జరిగిన ప్రయత్నాలు.. అందుకు సాగిన కుతంత్రాల గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. పెళ్లి తర్వాత రాజ కుటుంబానికి వెళ్లిన మేఘన్ కు బోలెడన్ని అవమానాలు ఎదురు కావటమే కాదు.. వీటిని భరించలేక ఒక దశలో ఆమె సూసైడ్ చేసుకోవాలని కూడా భావించారు.

రాజకుటుంబం నుంచి తెగ తెంపులు చేసుకొని బయటకు వచ్చి సాదాసీదాగా బతుకుతున్న ఈ జంట తరచూ వార్తల్లో ఉండటం తెలిసిందే. అన్యోన్య దంపతులుగా పేరున్న ఈ జంటను విడదీయటానికి జరిగిన కుట్రలకు సంబంధించిన ఒక ఉదంతం తాజాగా బయటకు వచ్చింది. ప్రిన్స్ హ్యారీతో పెళ్లి చెడగొట్టటానికి మేఘన్ వ్యక్తిత్వంపై సందేహాలు వ్యక్తమయ్యే కుట్రలు చాలానే జరిగాయట. అందుకు ఒక వర్గం మీడియా చాలా బలంగా పని చేసిన వైనం బయటకు వచ్చింది.

మేఘన్ ను దెబ్బ తీయటానికి.. ప్రిన్స్ హ్యారీతో ఆమె పెళ్లిని చెడగొట్టటానికి ఒక వర్గపు మీడియా చాలా దిగజారి మరీ ప్రవర్తించినట్లుగా నటుడు సిమన్ రెక్స్ వెల్లడించారు. ఒక రాతంత్రా మేఘన్ తో బెడ్ షేర్ చేసుకున్నట్లుగా చెబితే అతనికి రూ.50లక్షలు ఇస్తామని ఆఫర్ వచ్చినట్లు వెల్లడించారు. ఆ సమయంలో తనకు డబ్బులు చాలా అవసరం ఉందని.. కానీ డబ్బుకోసం అలాంటి తప్పుడు ప్రచారం తాను చేయలేనని చెప్పి ఆ ఆఫర్ ను రిజెక్టు చేసినట్లు చెప్పారు.

తనకు వచ్చిన ఆఫర్ గురించి.. తాను నో చెప్పిన విషయాన్ని తెలుసుకున్న మేఘన్ తనకు ఒక లేఖ రాశారని.. అందులో.. ''ఇంకా మంచి మనుషులు ఉన్నారని తెలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్'' అంటూ అతనికి ఒక లేఖ పంపినట్లు చెప్పారు. దాన్ని తాను ఫ్రేమ్ కట్టి మరీ దాచుకున్నట్లు చెప్పారు.

ఈ ఇద్దరు కలిసి 2005లో కట్స్ బ్యాక్ సిరీస్ లో ఒక ఎపిసోడ్ లో కలిసి నటించారు. నటిగా మంచి పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకన్న మేఘన్ ప్రిన్స్ హ్యారీని పెళ్లాడిన తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పటం తెలిసిందే. ఏమైనా..మేఘన్ ఇమేజ్ ను దెబ్బ తీయటానికి సాగిన ప్రయత్నాలు షాకింగ్ గా మారాయని చెప్పక తప్పదు.