Begin typing your search above and press return to search.

వర్మ: ధృవ్ సరే.. మేఘ సంగతేంటి?

By:  Tupaki Desk   |   24 Sept 2018 4:03 PM IST
వర్మ: ధృవ్ సరే.. మేఘ సంగతేంటి?
X
తెలుగు క్లాసిక్ 'అర్జున్ రెడ్డి' ని తమిళంలో 'వర్మ' పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విమర్శకులచేత ఎన్నోసార్లు ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ బాలా తెరకెక్కిస్తున్న ఈ రీమేక్ ద్వారా విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. రెండ్రోజుల క్రితం ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. టీజర్ రెస్పాన్స్.. ధృవ్ కు వచ్చిన రెస్పాన్స్ అందరికీ తెలిసిందే కాబట్టి అవి పక్కన బెడదాం. ఈ గొడవలో పడి హీరోయిన్ మేఘ చౌదరి విషయం సైడ్లైన్ అయింది.

మేఘ టీజర్ లాంచ్ లో మోడరన్ గర్ల్ గా కనిపించింది. ఒకరకంగా చెప్తే తన లుక్స్ తో అందరి దృష్టిని తనపైపు తిప్పుకుంది. కానీ సినిమాలో రోల్ మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా ట్రెడిషనల్ గా ఉండే పాత్ర కదా. టీజర్లో కనిపించింది కొన్ని సీన్స్ లోనే అయినా ఉన్నంతలో మేఘకు మంచి మార్కులే పడ్డాయి. ట్రెడిషనల్ తమిళమ్మాయి లుక్ కి బాగానే సూట్ అయింది. ఇక సినిమా చూస్తే గానీ నటన గురించి మనం మాట్లాడలేం.

తెలుగు 'అర్జున్ రెడ్డి' విషయానికి వస్తే విజయ్ దేవరకొండ విశ్వరూపం చూపించడంతో దాదాపు గా మిగతా అందరినీ డామినేట్ చేశాడు. అఖరికి హీరోయిన్ కు కూడా పెద్దగా బ్రేక్ రాలేదు. ఇక తమిళంలో మేఘ చౌదరి కి సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో వేచి చూడాలి.