Begin typing your search above and press return to search.

నితిన్ కు సిగ్గెక్కువమ్మా మోహనరంగా!!

By:  Tupaki Desk   |   3 April 2018 10:14 AM GMT
నితిన్ కు సిగ్గెక్కువమ్మా మోహనరంగా!!
X
గ‌త శుక్ర‌వారం విడుద‌లైన ‘రంగ‌స్థ‌లం’ సినిమా భారీ విజ‌యం సాధించ‌డంతో ఇప్పుడంద‌రి దృష్టి ఈ వారం విడుద‌ల కాబోతున్న ‘ఛ‌ల్ మోహ‌న‌రంగ‌’ సినిమాపై ప‌డింది. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ అందించిన క‌థ‌తో రూపొందుతున్న ఈ సినిమాపై అంచ‌నాలు బాగానే ఉన్నాయి. అందులోనూ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌హ- నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డమూ భారీ అంచనాల‌కు కార‌ణ‌మైంది.

నితిన్‌- మేఘా ఆకాష్ జంట‌గా రూపొందుతున్న ‘ఛ‌ల్ మోహ‌న‌రంగ‌’ ఏప్రిల్ 5న విడుద‌ల అవుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఓ ఛానల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చింది హీరోయిన్ మేఘా ఆకాష్‌. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ... ‘‘నితిన్ చాలా సిగ్గ‌రి. అంత ఈజీగా ఎవ‌రితోనూ మాట్లాడ‌డు. కానీ ఒక్క‌సారి క‌నెక్ట్ అయితే మాత్రం వ‌దిలించుకోవ‌డం క‌ష్టం. చాలా స‌ర‌దాగా జోకులు వేస్తూ... న‌వ్విస్తూ ఉంటాడు. ఆయ‌న‌తో క‌లిసి న‌టించ‌డం చాలా సౌక‌ర్యంగా ఉంటుంది. షూటింగ్ మొత్తం చాలా ఎంజాయ్ చేశాం. ఈ సినిమాలో నా పాత్ర చాలా బాగుంటుంది. పేరు కూడా నాదే. మేఘా! నా పేరు మీద పాట కూడా ఉంది. అందుకే ఏ మాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేసా...’’ అంటూ చెప్పుకొచ్చింది.

అమెరికాలోని మియామీలో ‘ఛ‌ల్ మోహ‌న‌రంగ‌’ షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ప‌డిపోయాన‌ని... అయితే అదృష్ట‌వ‌శాత్తూ ఏమీ కాలేద‌ని చెప్పింది మేఘా ఆకాష్‌. ప‌డిపోగానే న‌వ్వాన‌ని... ఇప్ప‌టికీ అది గుర్తొచ్చిన‌ప్పుడ‌ల్లా న‌వ్వుతూనే ఉంటాన‌ని మురిసిపోతోంది మేఘా ఆకాష్‌. పాట‌ల ర‌చ‌యిత కృష్ణ‌చైత‌న్య తొలిసారి ద‌ర్శ‌కుడిగా మారి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్‌... శ్రేష్ఠ మూవీస్ క‌లిసి సంయుక్తంగా నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే.