Begin typing your search above and press return to search.

మేఘ జోరు మామూలుగా లేదు!

By:  Tupaki Desk   |   26 Oct 2018 1:34 PM GMT
మేఘ జోరు మామూలుగా లేదు!
X
లక్కు గ్రాముల్లో కాకుండా టన్నుల్లో ఉండాలని అందరం కోరుకుంటాం కానీ అందరికీ అది రివర్స్ లో ఉంటుంది. అంటే లక్కు గ్రాముల్లో బ్యాడ్ లక్కు టన్నుల్లో ఉంటుంది. కానీ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న చెన్నై బ్యూటీ మేఘా ఆకాష్ కు మాత్రం లక్కు టన్నుల్లోనే ఉంది. ఎందుకంటారా?

మేఘా ఆకాష్ మొదటి సినిమానే ధనుష్ - గౌతమ్ మేనన్ కాంబోలో తెరకెక్కిన 'ఎన్నై నొక్కి పాయుం తొట్ట'. కానీ రిలీజ్ చాలా చాలా డిలే అయ్యి ఈ నవంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కానీ ఆ సినిమా వచ్చేలోపే తెలుగులో నితిన్ హీరోగా తెరకెక్కిన 'లై'..'చల్ మోహన్ రంగా' సినిమాలలో హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసింది. రెండూ బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచాయి. అలా అని లక్కు నిల్ కాలేదు.. లక్క లాగా అంటుకునే ఉంది.

ఏకంగా రజనీ 'పెట్టా' లో అవకాశం వచ్చింది. ఇది ఎంత పెద్ద ఆఫరో చెప్పాల్సిన అవసరం లేదు కదా? ఈ సినిమా కాకుండా 'అత్తారింటికి దారేది' తమిళ రీమేక్ లో సమంతా పాత్ర ను కొట్టేసింది. ఈ సినిమాకు దర్శకుడు సుందర్ సి. కాగా పవన్ కళ్యాణ్ పాత్రలో శింబు నటిస్తున్నాడు. ఇంతకంటే సూపర్ ఆఫర్లు ఇంకేముంటాయి? ఈ రెండూ కాకుండా 'బూమరాంగ్'.. 'శాటిలైట్ శంకర్' అనే సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. తెలుగులో రెండు సినిమాలు డిజప్పాయింట్ చేసినా సొంత గడ్డపై మాత్రం మేఘ జోరు మామూలుగా లేదు కదా. రజనీ - ధనుష్ - శింబు సినిమాలల్లో ఏ ఒక్కటి హిట్ అయినా మరిన్ని అవకాశాలు రావడం ఖాయమే. ఫ్లాపులుంటేనే ఆఫర్లు వరదలా వస్తున్నాయి. ఇక హిట్లుంటే..?

ఏదేమైనా మేఘాకు ఒక మంచి హిట్ రావాలని తెలుగులో కూడా ఒక హిట్ సినిమాతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం. బర్త్ డే బ్యూటీ మేఘ కు మా తుపాకి.కామ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.