Begin typing your search above and press return to search.

పాప ఖాతా హ్యాక్.. మళ్ళీ స్వాధీనం!

By:  Tupaki Desk   |   5 Feb 2019 10:22 AM GMT
పాప ఖాతా హ్యాక్.. మళ్ళీ స్వాధీనం!
X
'లై'.. 'చల్ మోహన్ రంగా' హీరోయిన్ మేఘా ఆకాష్ తెలుసు కదా.. వరసగా నితిన్ సినిమాల్లో నటించిన ఈ భామకు టాలీవుడ్ లో పెద్దగా అదృష్టం దక్కకపోవడంతో కోలీవుడ్ పైకి ఫోకస్ షిఫ్ట్ చేసింది. ఈ భామకు ఇప్పుడు పెద్ద కష్టం వచ్చిపడింది. అదేంటంటే.. పాప ఇన్స్టాగ్రామ్ ఖాతాను ఎవరో సచ్చినోళ్ళు హ్యాక్ చేశారట. ఆ ఘనులు ఆ ఖాతా ద్వారా 'ఆ' ఫోటోలు అప్లోడ్ చేశారట!

15 గంటల క్రితం ఈ విషయం తెలుపుతూ మేఘా తన ట్విట్టర్ ఖాతా ద్వారా 'నా ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్ అయింది! దయచేసి అన్ని మెసేజులు.. పిచ్చి పోస్టులను పట్టించుకోకండి. నా బ్యాకెండ్ టీమ్ ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు. త్వరలో కంట్రోల్ లోకి వస్తుంది. థ్యాంక్ యూ." ఇది ఓల్డ్ న్యూస్. ఫ్రెష్ న్యూస్ ఏంటంటే బ్యాక్ హ్యాండ్ టీం.. సారీ.. 'బ్యాకెండ్ టీమ్' తన ఖాతాను మళ్ళీ రిట్రీవ్ చేశారని ట్విట్టర్ ద్వారా తెలిపింది.. "హాయ్.. మా టీం చాలా హార్డ్ వర్క్.. స్ట్రగుల్ చేసిన తర్వాత నా ఇన్స్టాగ్రామ్ యాక్సెస్ మళ్ళీ వచ్చింది. ప్రైవసీని పోగొట్టుకోవడం బాధాకరం.. కానీ ఇప్పుడు నేను హ్యాపీ.. అంతా ఒకే. థ్యాంక్ యూ."

ఏంటో పాపల ఫోటోస్టొరీల గురించి కాకుండా ఇన్స్టాఖాతా హ్యాకుల గురించి కూడా పెద్ద న్యూస్ లాగా మాట్లాడాల్సి వస్తోంది. అన్నట్టు ఈ భామ హీరోయిన్ గా నటించిన 'వందా రాజవతాన్ వరువేన్' రీసెంట్ గా రిలీజ్ అయింది. పేరు.. వైబ్రేషన్స్ గట్రా చూసి అదేదో తమిళ క్లాసిక్ ఫిలిం అనుకోకండి. మన తెలుగు హిట్టు 'అత్తారింటికి దారేది' రీమేక్. ఎలా ఉంది అంటే.. రీమేక్ ని సున్నితంగా కాకుండా కర్కోటకంగా సండే రోజు ఫుల్లు స్పీడ్ లో ఖైమా కొట్టినట్టు కొడితే ఏమౌతుంది..? సరిగ్గా అలానే అయిందట. ఇంతకీ ఈ ఖైమా కొట్టిన ఘనుడు ఎవరనుకున్నారు .. ఖుష్బూ పతిదేవుడు సుందరు గారు!