Begin typing your search above and press return to search.

నితిన్ సరసన శ్రుతి కాదు.. ఇంకెవరంటే..

By:  Tupaki Desk   |   17 Nov 2016 1:30 PM GMT
నితిన్ సరసన శ్రుతి కాదు.. ఇంకెవరంటే..
X
తన కొత్త సినిమాలో శ్రుతి హాసన్ తో జోడీ కట్టాలని భావించాడు నితిన్. వాళ్లిద్దరి కాంబినేషన్ ఆల్మోస్ట్ ఓకే అయినట్లుగా వార్తలొచ్చాయి. కానీ మధ్యలో ఏం జరిగిందో ఏమో కానీ.. నితిన్ తో శ్రుతి జోడీ కట్టట్లేదని సమాచారం. హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్ చేయబోయే సినిమాకు కొత్త హీరోయిన్ ను ఎంపిక చేశారు. ఆ హీరోయిన్ పేరు మేఘా ఆకాశ్. 20 ఏళ్ల ఈ కొత్త బ్యూటీకి తెలుగులో ఇదే తొలి సినిమా.

హను రాఘవపూడి తొలి రెండు సినిమాల్లోనూ కొత్త కథానాయికలే నటించారు. అతడి తొలి సినిమా ‘అందాల రాక్షసి’లో లావణ్య త్రిపాఠి.. రెండో సినిమా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’లో మెహ్రీన్ నటించారు. వాళ్లిద్దరూ ఆ సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈసారి కూడా సెంటిమెంటుగా ఓ కొత్తమ్మాయినే తీసుకోవాలని హను ఫిక్సయ్యాడు. అందుకే శ్రుతిని కాదని మేఘా ఆకాశ్ కే ఛాన్సిచ్చాడు.

మేఘా ఆకాశ్ ఇప్పటికే తమిళ సినిమాల్లో నటించింది. అవి ఇంకా విడుదల కాలేదు. ఈలోపే తెలుగులో క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసింది. హను ఈ మధ్యే పెళ్లి చేసుకున్నాడు. అందుకే ఈ సినిమా అనుకున్న సమయానికి పట్టాలెక్కలేదు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ఆరంభమవుతుంది. హను రెండో సినిమాను ప్రొడ్యూస్ చేసిన 14 రీల్స్ సంస్థే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది. ఈ సినిమాలో 90 శాతం చిత్రీకరణ ఫారిన్లోనే జరగబోతుండటం విశేషం. వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ అనుకుంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/