Begin typing your search above and press return to search.

'సూపర్ స్టార్'కు విషెస్ తెలిపిన మెగాస్టార్.. ట్వీట్ వైరల్!

By:  Tupaki Desk   |   31 May 2021 7:01 PM IST
సూపర్ స్టార్కు విషెస్ తెలిపిన మెగాస్టార్.. ట్వీట్ వైరల్!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో నేడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. తెలుగు చిత్రపరిశ్రమలో అలుపెరుగని నటుడుగా నాలుగు దశాబ్దాలకు పైగా కొనసాగిన బుర్రిపాలెం వాస్తవ్యులు ఘట్టమనేని శివరామకృష్ణ.. ఇండస్ట్రీలో కృష్ణగా ప్రజాదరణ పొందారు. అయితే అభిమానులు మాత్రం ఆయనను సూపర్ స్టార్ అనే బిరుదుతో కొనియాడారు. ఇప్పటికి ఆయన సూపర్ స్టార్ కృష్ణగానే కొనసాగుతున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అన్నగారు సీనియర్ ఎన్టీఆర్ - అక్కినేని నాగేశ్వరరావుల తర్వాత అంతటి స్టార్డం అందుకున్న నటుడుగా సూపర్ స్టార్ కృష్ణ చరిత్రలోకెక్కారు. ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు - ఎన్నో ఎక్స్పరిమెంటల్ ఫిలిమ్స్ చేసి డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా ఆయన పేరు నిలుపుకున్నారు.

నేడు సూపర్ స్టార్ కృష్ణ గారు 78వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ సూపర్ స్టార్ అంటే కృష్ణ గారే అని చెప్పాలి. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈరోజు ఆయనకు పుట్టినరోజు శుభకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయనేతల నుండి సినీ సెలబ్రిటీల వరకు అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సూపర్ స్టార్ కేవలం నటుడు మాత్రమే కాదు. ఓ నిర్మాతగా.. ఓ దర్శకుడుగా.. ఓ మంచి మనసున్న వ్యక్తిగా.. ఓ రాజకీయనేతగా ఇలా అన్ని రంగాల్లో రాణించారు సూపర్ స్టార్. అయితే తాజాగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. "సాహసానికి మారుపేరు - మల్లెపువ్వు లాంటి మనిషి సూపర్ స్టార్ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు మెగాస్టార్ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం మెగాస్టార్ ట్వీట్ తో పాటు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. విజయశాంతి - కృష్ణ కాంబినేషన్ చాలా సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కాయి. కిలాడీ కృష్ణుడు నుంచి ఒసేయ్ రాములమ్మ వరకు తమ కాంబినేషన్ లో హిట్లు, సూపర్ హిట్లు - బ్లాక్ బస్టర్స్ వచ్చాయని ఆమె వెల్లడిస్తూ.. 'మీరంటే ఎప్పటికీ గౌరవం సర్' అంటూ విజయశాంతి వినమ్రతను చాటుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ వారసుడిగా మహేష్ బాబు కంటిన్యూ అవుతున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మహేష్ సినిమాలకు సంబంధించి ఏదొక అప్డేట్ అందిస్తుంటారు మహేష్. కానీ ఈసారి ఎలాంటి అప్డేట్ లేవని చెప్పడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. కానీ మెగాస్టార్ లాంటి వారు విషెస్ చెప్పడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.