Begin typing your search above and press return to search.

మెగాస్టార్ vs బాలయ్య.. బాక్సాఫీస్ డిమాండ్!

By:  Tupaki Desk   |   1 Nov 2022 7:37 AM GMT
మెగాస్టార్ vs బాలయ్య.. బాక్సాఫీస్ డిమాండ్!
X
మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ ఇద్దరు బాక్సాఫీస్ వద్ద పోటీపడిన ప్రతిసారి కూడా మార్కెట్ వాల్యూ ఒక్కసారిగా పెరిగిపోతూ ఉంటుంది. విడుదలకు ముందే వారు బిజినెస్ తోనే ఒక రేంజ్ లో రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇక 2023 సంక్రాంతికి ఇద్దరి సినిమాలు కూడా ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ముందుగా మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉన్నట్లు క్లారిటీ వచ్చింది.

ఇక నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి కూడా పొంగల్ బరిలో నిలవడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాను గోపీచంద్ మాలినేని తెరపైకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇక వాల్తేరు వీరయ్య సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఇద్దరు దర్శకులు కూడా ఒకప్పుడు మంచి స్నేహితులే. ఇక ఇప్పుడు బాలయ్య వర్సెస్ మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ క్లాష్ లో ఎలాంటి రికార్డులు క్రియేట్ అవుతాయి అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా ఊహించని రేంజ్ లోనే రికార్డింగ్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే సీడెడ్ ఏరియాలలో కూడా చిరంజీవి డామినేషన్ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా బాలకృష్ణకు మంచి డిమాండ్ ఉన్న సీడెడ్ ఏరియాలో కూడా మెగాస్టార్ సినిమా భారీ ధరకు అమ్ముడుపోయినట్లుగా పిలుస్తోంది. ఆ ఏరియాలో వీర సింహారెడ్డి సినిమాకు దాదాపు 13 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేసే ఛాన్స్ ఉందట.

ఇక మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య అదే ఏరియాలో దాదాపు 15 కోట్ల వరకు దర పలికే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే బాక్స్ ఆఫీస్ ట్రాక్ ప్రకారం అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కంటే బాలయ్య బాబు కాస్త ఫామ్ లో ఉన్నాడు. చివరగా వచ్చిన అఖండ సినిమా ఆ దాదాపు అన్ని ఏరియాలలో కూడా మంచి ప్రాఫిట్స్ అందించింది. ఇక మెగాస్టార్ మాత్రం ఖైదీ నెంబర్ 150 తర్వాత మళ్లీ పూర్తిస్థాయిలో ఎక్కడ కూడా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేయలేకపోయారు. మరి సీడెడ్ లో ఈ ఇద్దరు హీరోలలో ఎవరు అత్యధిక కలెక్షన్స్ అందుకుంటారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.