Begin typing your search above and press return to search.

మీసం మెలేయకు.. మాస్క్ ధ‌రించు వీరుడా!- చిరంజీవి

By:  Tupaki Desk   |   16 July 2020 12:20 PM IST
మీసం మెలేయకు.. మాస్క్ ధ‌రించు వీరుడా!- చిరంజీవి
X
``మీసం మెలేయడం వీరత్వం అనేది ఒకపుడు.. కానీ ఇపుడు మాస్క్‌ ధరించడం వీరుడి లక్షణం`` .. ఈ మాట అన్న‌ది ఎవ‌రో తెలుసా? మెగాస్టార్ చిరంజీవి. క‌రోనా మ‌హ‌మ్మారీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా దండ‌యాత్ర‌కు దిగిన‌ప్పుడు టాలీవుడ్ ని అప్ర‌మ‌త్తం చేయ‌డంలో జ‌న‌జాగృతం చేయ‌డంలో మెగాస్టార్ కృషి తెలిసిందే. ఉపాధి క‌రువై సినీకార్మికులు రోడ్డున ప‌డ‌కుండా కాపాడేందుకు క‌రోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)ని ప్రారంభించారు. వేలాది కార్మికుల‌కు నెల‌కోమారు నిత్యావ‌స‌ర స‌రుకుల్ని పంచే ఏర్పాటు చేశారు. ఇదే స్ఫూర్తితో మంత్రివ‌ర్యులు స‌హా ప‌లువ‌రు సెల‌బ్రిటీలు ప‌రిశ్ర‌మ‌లో నిత్యావ‌స‌రాల్ని పంచారు.

కరోనా కట్టడికి మాస్క్ తప్పనిసరిగా ధరించండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి... అంటూ అప్ప‌ట్లో వీడియో సందేశం ఇచ్చారు చిరు. అమితాబ్ బ‌చ్చ‌న్ స‌హా అన్ని ప‌రిశ్ర‌మ‌ల దిగ్గ‌జ స్టార్ల‌తో క‌లిసి తాను ఒక ల‌ఘు చిత్రంలో న‌టించి ఆ వీడియోని సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ చేశారు చిరు. ఇప్పుడు కూడా మ‌రోసారి ప్ర‌చారం కోసం వీడియోల్ని రూపొందించారు. మాస్క్ ధ‌రించి మీ కుటుంబాన్ని.. దేశాన్ని కూడా కాపాడండి.. ప్లీజ్‌.. అంటూ అభ్య‌ర్థించారు చిరు. మ‌హ‌మ్మారీ మ‌నుముందు పెనువిల‌యం సృష్టించ‌నుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూ.హెచ్.ఓ) హెచ్చ‌రించిన నేప‌థ్యంలో చిరు మ‌రో వీడియోతో ప్రేక్ష‌కాభిమానుల్ని హెచ్చ‌రించే ప్ర‌య‌త్నం చేశారు.

దయచేసి ప్రాథమిక జాగ్రత్తలను పాటిస్తూ..ఐక్యంగా పోరాడి ఈ బాధలను తొలగించు కుందాం అంటూ చిరు విజ్ఞప్తి చేశారు. హీరోయిన్‌ ఈషా రెబ్బా.. యువ‌హీరో కార్తికేయ కనిపించిన ఈ రెండు వీడియోలు ఫ్యాన్స్ లో వైర‌ల్ గా మారాయి. మెగాస్టార్ ప్ర‌స్తుతం `ఆచార్య` చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొనాల్సి ఉండ‌గా మ‌హ‌మ్మారీ తీవ్ర‌త దృష్ఠ్యా వేచి చూస్తున్న సంగ‌తి తె‌లిసిందే.