Begin typing your search above and press return to search.

దేవిపై మెగాస్టార్ 'ఉప్పెన' అంత ప్రశంస

By:  Tupaki Desk   |   22 Feb 2021 5:00 AM GMT
దేవిపై మెగాస్టార్ ఉప్పెన అంత ప్రశంస
X
మెగా ఫ్యామిలీ నుండి వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉప్పెన సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా వంద కోట్ల దిశగా దూసుకు పొంతుంది. ఈ విజయంలో కీలక పాత్రను సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ పోషించాడు అనడం లో సందేహం లేదు. అందుకే ఆయనకు చిరంజీవి ప్రత్యేక అభినందనలు తెలియజేయడం తో పాటు అందమైన ఒక బొమ్మను కూడా బహుమానంగా పంపించండం జరిగింది.

చిరంజీవి ఒక లేఖను కూడా ఈ సందర్భంగా దేవి శ్రీ కి రాయడం జరిగింది... అందులో డియర్ డీఎస్పీ ఎగసిపడిన ఈ ఉప్పెన విజయానికి నీ సంగీతం ఆయువుపట్టు. స్టార్స్ చిత్రాలకు ఎంత ఫ్యాషన్ తో సంగీతాన్ని ఇస్తావో చిత్ర రంగంలోకి ప్రవేశించిన కొత్త వారికి కూడా అంతే ఫ్యాషన్ తో సంగీతాన్ని ఇస్తావు. నీలో ఉండే ఈ ఎనర్జీ సినిమాలకు నీ మ్యూజిక్ ఇచ్చే ఎనర్జీ ఎప్పటికి ఇలాగే ఉండాలని కోరుకుంటూ నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ప్రేమతో చిరంజీవి అంటూ పేర్కొన్నాడు. చిరు ఇచ్చిన బహుమానంతో పాటు లేఖను అపురూపంగా చూసుకుని దేవి శ్రీ ప్రసాద్ ఆనందం తో ఎగిరి గంతులు వేశాడు.