Begin typing your search above and press return to search.

క్రేజీ మెగా కాంబోపై మరింత క్లారిటీ

By:  Tupaki Desk   |   8 Jun 2020 9:00 AM IST
క్రేజీ మెగా కాంబోపై మరింత క్లారిటీ
X
మెగాస్టార్‌ చిరంజీవి.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ల కాంబోలో మూవీ గురించి చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లక ముందే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తే బాగుంటుందని అంతా అనుకున్నారు. కాని అప్పుడు కుదరలేదు. మళ్లీ చిరంజీవి సినిమాల్లోకి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అయినా త్రివిక్రమ్‌ తో సినిమా చేయాలని ఆశిస్తున్నారు. గతంలో పలు ఇంటర్వ్యూల్లో త్రివిక్రమ్‌ తో సినిమా చేయాలని ఉందని చిరంజీవి పేర్కొన్నారు. అన్నట్లుగానే ఇటీవల త్రివిక్రమ్‌ చెప్పిన స్టోరీ లైన్‌ కు చిరంజీవి ఓకే చెప్పారట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి త్రివిక్రమ్‌ ల కాంబో మూవీ వచ్చే ఏడాది లేదా ఆ తర్వాత ఏడాది అయినా ఖచ్చితంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. త్రివిక్రమ్‌ తన తదుపరి చిత్రంను ఎన్టీఆర్‌ తో చేసేందుకు ఇప్పటికే సిద్దం అయ్యాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం షూటింగ్‌ పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే ఎన్టీఆర్‌ తో సినిమాను త్రివిక్రమ్‌ మొదలు పెట్టబోతున్నాడు. ఇక త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ మూవీ కూడా ఉంటుందని అంటున్నారు. కాని చరణ్‌ కంటే ముందు చిరంజీవి త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమాను చేస్తాడని మెగా కాంపౌండ్‌ లో టాక్‌ వినిపిస్తుంది.

ప్రస్తుతం చిరంజీవి ఆచార్య చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఆ తర్వాత మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ లూసీఫర్‌ ను చేయబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. సుజీత్‌ దర్శకత్వంలో లూసీఫర్‌ రీమేక్‌ చేసి ఆ తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు. వీరిద్దరి కాంబోకు మెగా ఫ్యాన్స్‌ లోనే కాకుండా సాదారణ ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. వీరిద్దరి కాంబో సినిమాను రాధాకృష్ణ మరియు చరణ్‌ లు కలిసి నిర్మించే అవకాశం ఉందని అప్పుడే సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.