Begin typing your search above and press return to search.

మెగాస్టార్‌ తో ఓకే చెప్పించిన ఎన్టీఆర్‌ డైరెక్టర్‌

By:  Tupaki Desk   |   16 July 2020 2:20 PM IST
మెగాస్టార్‌ తో ఓకే చెప్పించిన ఎన్టీఆర్‌ డైరెక్టర్‌
X
ఎన్టీఆర్‌ తో ‘జై లవకుశ’ చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు బాబీ. ఆ చిత్రం తర్వాత ‘వెంకీమామ’ చిత్రంతో వచ్చిన బాబీ త్వరలో చిరంజీవిని డైరెక్ట్‌ చేసే అవకాశం కనిపిస్తుంది. మెగాస్టార్‌ యంగ్‌ డైరెక్టర్స్‌ తో వర్క్‌ చేయాలని భావిస్తున్నట్లుగా చెప్పడంతో బాబీ ఒక పవర్‌ ఫుల్‌ స్టోరీని చిరంజీవి కోసం రెడీ చేశాడట. ఇటీవలే చిరంజీవిని కలిసిన బాబీ ఆ స్టోరీని చెప్పడంతో పాటు ఓకే చెప్పించాడట. తప్పకుండా త్వరలోనే చేద్దామంటూ బాబీకి చిరంజీవి హామీ ఇచ్చారట.

వెంకీ మామ చిత్రంతో అంచనాలు అందుకోలేక పోయిన బాబీ ఏకంగా చిరంజీవితోనే సినిమాకు రెడీ అవ్వడం ఆయన లక్‌ గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య చిత్రం తర్వాత లూసీఫర్‌ ను చిరంజీవి చేయబోతున్నాడు. ఆ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే పూర్తి చేసే ఉద్దేశ్యంలో మెగాస్టార్‌ ఉన్నాడట. అంటే బాబీ దర్శకత్వంలో చిరంజీవి వచ్చే సమ్మర్‌ లో సినిమాను చేసే అవకాశం ఉందని టాక్‌ వినిపిస్తుంది.

బాబీ మొదటి చిత్రం ‘పవర్‌’ మాస్‌ మసాలా హిట్‌ గా నిలిచింది. మళ్లీ అలాంటి స్క్రిప్ట్‌ నే చిరంజీవికి బాబీ వినిపించాడట. బాబీ చెప్పిన కథకు ఇంప్రెస్‌ అయిన చిరంజీవి చిన్న చిన్న మార్పులు చేర్పులు సూచించి డైలాగ్‌ వర్షన్‌ స్క్రిప్ట్‌ ను కూడా రెడీ చేయాలంటూ సూచించాడట. ప్రముఖ నిర్మాత ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. రామ్‌ చరణ్‌ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే బాబీ.. మెగాస్టార్‌ మూవీ గురించి మరింత క్లారిటీ రావచ్చు.