Begin typing your search above and press return to search.
ఆ విషయం తెలిసి 'సాహో మెగాస్టార్' అంటున్న అభిమానులు
By: Tupaki Desk | 12 April 2020 10:00 AM ISTకరోనా వైరస్ ప్రభావం దేశంలో రోజురోజుకి అధికం అవుతోంది. ఈ కరోనా వైరస్ ఏ క్షణాన మొదలైందో గానీ వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ అన్నింటిలోనూ ఫేక్ న్యూస్ హవా మొదలైంది. అసలు నమ్మాల్సిన న్యూస్ ఏంటో నకిలీ న్యూస్ ఏంటో తెలుసుకోలేని స్థాయిలో కొందరు ఫేక్ వార్తలను రియల్ న్యూస్‌కి మించిన స్థాయిలో వైరల్ చేస్తున్నారు. ఆ ఫేక్ వార్తలను కొన్ని ప్రచార మాధ్యమాలు కూడా నమ్మి ప్రచురించడం కలకలం రేపుతోంది. సాక్ష్యాత్తు మెగాస్టార్ చిరంజీవి తల్లి గారైన అంజనాదేవి కరోనా బాధితుల కోసం.. కొందరు సహచర మహిళలతో కలిసి దాదాపుగా 700 మాస్కులవరకు కుట్టి సమాజంపట్ల, దేశం పట్ల తనవంతు బాధ్యతతో ముందుకు వచ్చారని మీడియా మాధ్యమాల్లో ప్రచారం జరిగింది.
ఇది విన్న ప్రజలు ఆమెపై ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉండగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. వాస్తవానికి నిన్నటి నుండి మీడియా మాధ్యమాల్లో ప్రసారం అవుతున్న ఆ ఫొటోలో ఉన్నది తన తల్లి అంజనమ్మ కాదని, అయితేనేమి తన దయాగుణంతో ఇంత మంచి పని చేస్తున్న కమ్మనైన మనసున్న ప్రతి తల్లి అమ్మే అని, ఆమెకు ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ.. మెగాస్టార్ తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా బదులిచ్చారు. మెగాస్టార్ విశాలమైన సేవా దృక్పథానికి అభిమానులు సాహో మెగాస్టార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.