Begin typing your search above and press return to search.

మరో ప్రాజెక్ట్ మొదలెట్టిన మెగాస్టార్

By:  Tupaki Desk   |   17 Jan 2023 5:31 AM GMT
మరో ప్రాజెక్ట్ మొదలెట్టిన మెగాస్టార్
X
మెగాస్టార్ చిరంజీవి గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. హిట్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఒకదాని తర్వాత ఒకటి సెట్స్ పైకి తీసుకొని వెళ్ళడం. వీలైనంత వేగంగా సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకురావడం చేస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో అందరికంటే వేగంగా సినిమాలు చేస్తున్న హీరో అంటే మెగాస్టార్ చిరంజీవి అని చెప్పాలి. గత ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిరంజీవి ఈ ఏడాది సంక్రాంతి బరిలో వాల్తేర్ వీరయ్యని రిలీజ్ చేశారు.

ఈ మూవీ కమర్షియల్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. అలాగే వంద కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయింది. లాంగ్ రన్ లో మూవీకి ఆదరణ ఎలా ఉంటుందనేదాని మీద ఏ రేంజ్ సక్సెస్ అనేది తెలుస్తుంది. ఇదిలా ఉంటే వాల్తేర్ వీరయ్య రిలీజ్ హడావిడి పూర్తవగానే మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నెక్స్ట్ చేయబోతున్న భోళా శంకర్ షూటింగ్ ని స్టార్ట్ చేసేశారు. మెహర్ రమేష్ 10 ఏళ్ళ తర్వాత మరల మెగా ఫోన్ పట్టుకొని మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ చేయబోతున్నాడు.

ఆయన చివరిగా వెంకటేష్ తో షాడో అనే సినిమా చేయగా అది కాస్తా డిజాస్టర్ అయ్యింది. అయితే పదేళ్ళ తర్వాత మెహర్ రమేష్ టేకింగ్ స్కిల్స్ మీద నమ్మకంతో మెగాస్టార్ అతనికి అవకాశం ఇచ్చాడు. ఇక ఈ భోళా శంకర్ మూవీ తమిళంలో అజిత్ హీరోగా తెరకెక్కి సూపర్ హిట్ అయిన వేదాలం రీమేక్ గా తెరకెక్కుతుంది. సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ కనిపించబోతుంది. ఇక హీరోయిన్ గా తమన్నా నటిస్తుంది.

సైరా నరసింహారెడ్డి తర్వాత మరోసారి ఈ సినిమాలో తమన్నా చిరంజీవితో రొమాన్స్ చేయబోతుంది. కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని మెహర్ రమేష్ తెరకెక్కి స్తున్నారు. వేదాలం మెయిన్ స్టొరీ లైన్ తీసుకొని చిరంజీవి కమర్షియల్ ఇమేజ్ కి తగ్గట్లుగా మార్పులు చేసి ఎంటర్టైనర్ గా ఈ సినిమా స్క్రిప్ట్ ని మెహర్ రమేష్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా జూబ్లిహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని దర్శకుడు మెహర్ రమేష్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశాడు. నెక్స్ట్ వీక్ నుంచి షూటింగ్ షెడ్యుల్ స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.