Begin typing your search above and press return to search.

మెగాస్టార్ సినిమా విడుద‌ల వాయిదా!

By:  Tupaki Desk   |   31 March 2021 6:00 AM IST
మెగాస్టార్ సినిమా విడుద‌ల వాయిదా!
X
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ లేటెస్ట్ మూవీ 'చెహ్రా'. ఈ సినిమాలో సీరియ‌ల్ కిస్స‌ర్ ఇమ్రాన్ హ‌ష్మీ కూడా న‌టిస్తున్నాడు. మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ద‌ర్శ‌కుడు రూమీ జాఫ్రీ తెర‌కెక్కించారు. ఎప్పుడో కంప్లీట్ అయిన ఈ చిత్రం.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కూడా తుది ద‌శ‌కు చేరుకుంది.

నిజానికి ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ బొనాంజాగా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేశారు. ఏప్రిల్ 9న స్లాట్ బుక్ చేసిన యూనిట్.. ఆ డేట్ కు రిలీజ్ చేసేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేసింది. అయితే.. ప‌నులు పూర్తయిన‌ప్ప‌టికీ.. సినిమా రిలీజ్ వాయిదా వేయాల‌ని యూనిట్ నిర్ణ‌యించింది.

దీనికి కార‌ణం.. క‌రోనా అని వెల్ల‌డించింది చిత్ర బృందం. ముంబైతోపాటు ఉత్త‌రాదిన క‌రోనా కేసులు పెర‌గ‌డం, ప్ర‌భుత్వం థియేట‌ర్ల‌కు కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ప్ర‌క‌టించ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్ట తెలిపింది. మ‌ళ్లీ ఎప్పుడు రిలీజ్ చేసేది త్వ‌ర‌లో తెలియ‌జేస్తామ‌ని ప్ర‌క‌టించింది.