Begin typing your search above and press return to search.

మెగాస్టార్ సినిమా పక్కా కమర్షియల్ అంశాలతో రాబోతుందా..??

By:  Tupaki Desk   |   23 Dec 2020 9:29 AM GMT
మెగాస్టార్ సినిమా పక్కా కమర్షియల్ అంశాలతో రాబోతుందా..??
X
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మాట్నీ ఎంటర్టైమెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో రామ్ చరణ్, నిరంజన్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత చిరు నటించే సినిమా పై రోజు ఏదొక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంది. ఆచార్య తర్వాత మలయాళ సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’ లో చిరంజీవి నటించబోతున్నారు. ఇప్పటికే ‘లూసిఫర్’ సినిమా తెలుగు హక్కులను రాంచరణ్ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నాడు. మొన్నటి వరకు ముసుగులో గుద్దులాటలా ఉన్న దర్శకుడి విషయాన్నీ కూడా మెగాస్టార్ తేల్చేసారు. ఇక తెలుగులో ఈ సినిమాను వివి వినాయక్, బాబీ, సుజిత్ వంటి దర్శకులు తెరకెక్కిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్నాడని చిరు క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతం స్క్రిప్ట్ పనులలో ఉన్న మోహన్ రాజా.. చిరు కోరిన విధంగా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట. నిజానికి మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లూసిఫర్ సినిమా సూపర్ హిట్ అయింది. అందులోను హీరోయిన్ లేకుండా హిట్టయి మంచి కలెక్షన్స్ రాబట్టుకుంది. అయితే తెలుగు వెర్షన్ లో మాత్రం మెగాస్టార్ మాస్ ఎంటర్టైన్మెంట్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి హీరోయిన్ పాత్ర కూడా ఉండేలా స్క్రిప్ట్ లో మార్పులు చేయిమని మోహన్ రాజాకు సూచించారట. అంతేగాక మెగాస్టార్ మూవీ అంటే మినిమం డాన్స్, డ్యూయెట్ సాంగ్స్ ఎక్సపెక్ట్ చేస్తారు. ఆ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట డైరెక్టర్. ఇక మిగిలింది హీరోయిన్ విషయం ఒకటే. మరి చిరు సరసన ఏ హీరోయిన్ చిందెయ్యనుందో కన్ఫర్మ్ కాలేదు. కానీ గోవా బ్యూటీ ఇలియానా పేరు మాత్రం బాగానే వినిపిస్తుందని టాక్. చూడాలి మరి మెగాస్టార్ కమర్షియల్ లూసిఫర్ ఎలా ఉండబోతుందో..!