Begin typing your search above and press return to search.

2021-22 సీజ‌న్ కి మెగాస్టార్ లాక్ చేసిన‌ టైటిల్స్ ఇవే

By:  Tupaki Desk   |   21 Aug 2021 7:00 PM IST
2021-22 సీజ‌న్ కి మెగాస్టార్ లాక్ చేసిన‌ టైటిల్స్ ఇవే
X
టైటిల్ తోనే స‌గం విజ‌యం. అందుకే టైటిల్ ఎంపిక కోసం చాలా స‌మ‌యం తీసుకుంటారు. వంద‌లు వేలాది టైటిల్స్ ని ప‌రిశీలించి చివ‌రికి ఒక టైటిల్ ని ఎంపిక చేస్తారు. టైటిల్ ఎంపిక‌లో మెగా కాంపౌండ్ మ‌రీ సీరియ‌స్ గా ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్స్ ఎంపిక చేసుకున్న‌ కంటెంట్ ని బేస్ చేసుకుని ఫిక్స్ చేస్తారు. టైటిల్ లోనే కంటెంట్ ఏమిటో చెప్పే ప్ర‌య‌త్నం చేస్తుంటారు.

చిరంజీవి క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మైన నాటి నుంచి నేటి వ‌ర‌కూ టైటిల్స్ విష‌యంలో ఎంతో సెలెక్టివ్ గానే ఉన్నారు. ఆయ‌న దర్శ‌క‌నిర్మాత‌లు క‌మిటెడ్ గా ఉన్నారు. టైటిల్ నిర్ణ‌యంలో మెగాస్టార్ పాత్ర అత్యంత కీల‌కంగా ఉంటుంద‌న్న‌ది తెలిసిన విష‌య‌మే. అవ‌స‌రం మేర టైటిల్స్ ని త‌న‌దైన అనుభ‌వంతో యువ‌మేక‌ర్స్ కి ముంద‌స్తుగా చిరంజీవి సూచిస్తుంటారు. ఆ టైటిల్స్ చిరంజీవి ఇమేజ్ కి ఎంత మాత్రం త‌గ్గ‌కుండా అంతే ప‌వ‌ర్ ఫుల్ గాను ఉండేలా చూసుకుంటారు. ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలోని `ఆచార్య` టైటిల్ ఎంపిక‌లోనూ బాస్ ప్ర‌మేయం ఉంది.

ఆచార్య పాత్ర‌లో చిరంజీవి క‌నిపిస్తారు కాబ‌ట్టి.. మెగాస్టార్ మాస్ ఇమేజ్ కి ఎంతమాత్రం త‌గ్గ‌కుండా ఈ టైటిల్ ని ఎంపిక చేసుకున్నారు. ఇటీవ‌లే ఆచార్య షూటింగ్ పూర్తి చేసిన చిరు త‌దుప‌రి వ‌రుసా ప‌వ‌ర్ ఫుల్ టైటిల్స్ ని లాక్ చేశారు. ఇటీవ‌ల లూసీఫ‌ర్ రీమేక్ `గాడ్ ఫాద‌ర్` షూటింగ్ లో చిరు జాయిన్ అయ్యారు. త‌మిళ ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో చిరంజీవి చ‌ర్చి ఫాద‌ర్ గా క‌నిపించ‌నున్నారు. టైటిల్ పాత్ర‌తో చిరంజీవి మెస్మ‌రైజ్ చేయాల‌న్న‌ది త‌న ఇమేజ్ ని బ‌ట్టి ఎంపిక‌. అభిమానుల‌కు ఎలాంటి సందేహాల్లేకుండా టైటిల్ ల్లోనే కంటెంట్ ఎలా ఉండ‌బోతుంద‌న్న‌ది ఓ క్లారిటీ దొరికింది. అలాగే త‌మిళ సినిమా `వేదాళం` రీమేక్ లోనూ చిరంజీవి న‌టించ‌నున్నారు.

ఈ సినిమా తెలుగు టైటిల్ ఇంకా రివీల్ చేయ‌లేదు. మ‌రోవైపు య‌వ ద‌ర్శ‌కుడు బాబి ద‌ర్శ‌క‌త్వంలో ఓ ఫ్యాన్ బేస్డ్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకి `వాల్తేరు వీర‌న్న` అనే మాసీ టైటిల్ ని ఎంపిక చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. వాల్తేరు అనేది విశాఖ‌ప‌ట్ణ‌ణంలో ఫేమ‌స్ ఏరియా. టైటిల్ ని బ‌ట్టి వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ అని తెలుస్తోంది. అలాగే `భోళా శంక‌ర` అనే మ‌రో టైటిల్ ని మెగాస్టార్ కోసం రిజిస్ట‌ర్ చేసిన‌ట్లు తెలుస్తోంది. బ‌హుశా ఇది మెహ‌ర్ ర‌మేష్ కోసం ఎంపిక చేసిన టైటిల్ అని గెస్ చేస్తున్నారు. మెగాస్టార్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ టైటిల్స్ ని ప్ర‌క‌టిస్తారేమో చూడాలి. ఆగ‌స్టు 22న మెగాస్టార్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఇప్ప‌టికే అభిమానుల‌ సంబ‌రాలు ప‌తాక స్థాయికి చేరాయి. నేటి సాయంత్రం ట్విట్ట‌ర్ స్పేస్ లో సాటి క‌థానాయ‌కులు స‌హా అభిమానులు చిరు బ‌ర్త్ డే స్పెష‌ల్ చాటింగ్ లో సంద‌డి చేయ‌నున్నారు. ప్ర‌భాస్ - విక్ట‌రీ వెంక‌టేష్ స‌హా ప‌లువురు ట్విట్ట‌ర్ స్పేస్ లో ట‌చ్ లో కి రావ‌డం మెగాభిమానుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. చిరంజీవి బ‌ర్త్ డే వేడుక‌ల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి అభిమాన సంఘాల ప్ర‌తినిధులు స‌హా అటు విదేశాల్లోని సంఘాల అధిప‌తులు కూడా హైద‌రాబాద్ కి విచ్చేసార‌ని కూడా క‌థ‌నాలొస్తున్నాయి.