Begin typing your search above and press return to search.

స్టేట్ మినిస్టర్ కి ఛాలెంజ్ విసిరిన 'స్టేట్ రౌడీ'...!

By:  Tupaki Desk   |   23 April 2020 11:20 AM IST
స్టేట్ మినిస్టర్ కి ఛాలెంజ్ విసిరిన స్టేట్ రౌడీ...!
X
కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా సెలబ్రిటీలు ఇంటికే పరిమితమైపోయారు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఖాళీగా ఉన్న భర్తలు తమ భార్యలకు సాయం చేయాలని.. అతనే 'రియల్ మ్యాన్' అంటూ 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రారంభించిన 'బి ది రియల్ మ్యాన్' ఛాలెంజ్‌ లో ఒక్కొక్కరుగా భాగస్వామ్యం అవుతున్నారు. ఇటీవల జక్కన్న విసిరినా ఛాలెంజ్ స్వీకరించిన ఎన్టీఆర్ ఇంటి పనులు చేస్తున్న వీడియోను పోస్ట్ చేసి అగ్ర కథానాయకులు నలుగురు చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలయ్యలను ఇంటి పనులు చేయాల్సిందిగా ఛాలెంజ్ విసిరాడు. ఎన్టీఆర్ విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన చిరు.. ఇంటి పనులను చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. 'రోజూ చేసే పనే అయినా ఇవ్వాళ మీకోసం ఈ వీడియో సాక్ష్యం' #BeTheReaMan అంటూ పోస్ట్ చేసాడు.

ఇంటిని శుభ్రం చేయడం.. దోశలు వేయడం.. ప్రేమగా అమ్మ అంజనాదేవీకి వడ్డించడం.. ప్రేమతో కొడుక్కి తినిపించడం ఈ వీడియోలో కనిపిస్తోంది. అయితే ఇప్పటి దాకా అందరు సెలెబ్రెటీలు తమ భార్యలకు సేవలు చేస్తూ రియల్ మ్యాన్ అనిపించుకోగా.. మెగాస్టార్ మాత్రం తన మాతృమూర్తికి సేవలు చేసి ఇక్కడ కూడా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అంతేకాదు ఈ చాలెంజ్‌ ను కొనసాగించాల్సిందిగా తెలంగాణ రాష్ట్రమంత్రి కేటీఆర్ మరియు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ లకు సవాలు విసిరాడు. మరి రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ ఈ ఛాలెంజ్ స్వీకరించి ఎలా ముందుకు తీసుకెళ్తాడో చూడాలి. అయితే పవన్ కళ్యాణ్‌ను నామినేట్ చేయండని మెగా ఫ్యాన్స్ చేసిన విన్నపాన్ని చిరు ఏమాత్రం పట్టించుకోలేదని చెప్పవచ్చు.

'బి ది రియల్ మ్యాన్' చాలెంజ్‌ను మొదటగా అర్జున్‌ రెడ్డి దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ప్రారంభించాడు. సందీప్‌ రాజమౌళిని ఛాలెంజ్ చేయగా రాజమౌళి.. కీరవాణి, ఎన్టీఆర్‌, రామ్ చరణ్ లను సవాలు చేశాడు. వెంటనే స్పందించిన ఎన్టీఆర్.. టాలీవుడ్‌ అగ్ర కథానాయకులు నలుగురిని చాలెంజ్‌ చేశాడు. జక్కన్న సవాలని పూర్తి చేసిన రామ్ చరణ్‌ ఈ చాలెంజ్‌ను బాలీవుడ్‌ కు తీసుకెళ్లాడు. హిందీ హీరో రణవీర్‌ సింగ్‌ ను చాలెంజ్‌ చేశాడు చరణ్‌. ఇప్పటికే కొరటాల శివ, కీరవాణి, సుకుమార్ ఈ టాస్కుని కంప్లీట్ చేసి విజయ్ దేవరకొండ, తమన్ లకు ఛాలెంజ్ పాస్ చేసారు. ఇప్పటికే విక్టరీ వెంకటేష్ మరియు తమన్ ఈ ఛాలెంజ్ స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. మరి రానున్న రోజుల్లో ఈ 'బి ది రియల్ మ్యాన్' ఛాలెంజ్ ఎక్కడిదాకా విస్తరిస్తుందో చూడాలి.