Begin typing your search above and press return to search.
చిరుకు కరోనా.. కొరటాలకే ఎందుకు ఈ పరీక్ష
By: Tupaki Desk | 10 Nov 2020 11:45 AM ISTమెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా గత ఏడాదిలోనే ఆరంభం అవ్వాల్సి ఉన్నా కూడా సైరా సినిమా కోసం చిరు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. రెండు సినిమాల్లో ఒకేసారి నటించడం కష్టం అని సైరా షూటింగ్ పూర్తి అయిన తర్వాత కొరటాల శివ సినిమాను చేయాలని భావించాడు. కాని సైరా విడుదలైన మూడు నాలుగు నెలల తర్వాత ఆచార్య సినిమా షూటింగ్ ప్రారంభించారు.
భరత్ అనే నేను సినిమా తర్వాత చాలా గ్యాప్ రావడంతో దర్శకుడు కొరటాల ఆచార్య సినిమాను కేవలం మూడు నెలల్లోనే పూర్తి చేయాలని భావిస్తున్నట్లుగా చెప్పాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ వేడుక సందర్బంగా కేవలం 100 రోజుల లోపుల్లోనే ఆచార్యను పూర్తి చేస్తానంటూ కొరటాల హామీ ఇచ్చాడు.
సినిమాను జూన్ జులై వరకు షూటింగ్ పూర్తి చేసి ఆగస్టులో విడుదల చేయాలనుకున్నారు. ఆ వెంటనే కొరటాల శివ మరో సినిమాను మొదలు పెట్టాలని ఆశ పడ్డాడు. కాని ఆయన ప్లానింగ్ మొత్తం కరోనా కల్లోల మార్చేసింది. చిరంజీవి వయసు రీత్యా కాస్త ఆలస్యంగా సినిమా షూటింగ్ ను పునః ప్రారంభించాలని భావించాడు. నిన్నటి నుండి షూటింగ్ ను ప్రారంభించి స్పీడ్ గా పూర్తి చేసి వచ్చే సమ్మర్ లో సినిమాను విడుదల చేయాలని భావించాడు. ఆ తర్వాత బన్నీతో కొరటాల సినిమా చేయాల్సి ఉంది.
ఆచార్య షూటింగ్ ప్రారంభం అవుతుంది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా చిరంజీవికి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. కరోనా వల్ల కనీసం నెల రోజులు అయినా ఆచార్య సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. తద్వార సినిమా సమ్మర్ లో విడుదల అయ్యే అవకాశం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఇప్పటికే భరత్ అనే నేను సినిమా విడుదల అయ్యి మూడేళ్లు కావస్తుంది. కరోనా వల్ల మళ్లీ ఆచార్య ఆలస్యం అవుతుండటంతో ఆమె అభిమానులు కొరటాలకే ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.