Begin typing your search above and press return to search.

‘మా’ ఎపిసోడ్ లోకి మెగాస్టార్ ఎంట్రీ.. లేఖలో ఏం రాశారు?

By:  Tupaki Desk   |   10 Aug 2021 3:30 AM GMT
‘మా’ ఎపిసోడ్ లోకి మెగాస్టార్ ఎంట్రీ.. లేఖలో ఏం రాశారు?
X
గడిచిన కొద్దిరోజులుగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)ఎన్నికల వ్యవహారం పలు మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. రెండేళ్ల పదవీ కాలం పూర్తి అయినప్పటికీ.. ఎన్నికల నిర్వహణ విషయంలో ఇప్పుడు హాట్ హాట్ చర్చ నడుస్తోంది. తొలుత కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎన్నికలు వాయిదా పడగా.. తాజాగా ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. మొన్న హేమ ఆడియో క్లిప్ తో తన వాదన ఏమిటన్నది తెలియజేస్తే.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నేరుగా రంగంలోకి దిగారు. ఇప్పటివరకు ‘మా’ ఎన్నికల విషయంలో పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ.. తనదేమీ లేదన్నట్లుగా వ్యవహరించే చిరు..ఏకంగా లెటర్ రాసేయటం.. క్రమశిక్షణా సంఘాన్ని ఎన్నికల్ని వెంటనే నిర్వహించాలని కోరటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

క్రమశిక్షణ సంఘానికి చిరు రాసిన లేఖలో ఏముంది? ఆయనే అంశాల్ని ఎక్కువగా ఫోకస్ చేశారు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. చిరు లెటర్ ను సింగిల్ లైన్ లో సూటిగా చెప్పేయాలంటే.. ‘మా’ ఎన్నికల్ని వెంటనే నిర్వహించాలి. ఎన్నికలు ఆలస్యమైతే సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని పేర్కొన్నారు. సభ్యుల బహిరంగ ప్రకటనలతో ‘మా’ ప్రతిష్ట మసకబారుతోందని, ‘మా’ ప్రతిష్ఠ దెబ్బతీస్తున్న ఎవర్నీ ఉపేక్షించవద్దని చిరంజీవి లేఖలో కృష్ణంరాజును కోరారు. ప్రస్తుతం ఉన్నది ఆపద్ధర్మ కార్యవర్గమేనని స్పష్టం చేశారు. సమస్యను కృష్ణంరాజు త్వరగా పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు చిరంజీవి తన లేఖలో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇంతకూ చిరు రాసిన లేఖలో ఏముంది? అన్నది యథాతధంగా చెప్పాల్సి వస్తే..

సోదరు సమానులు.. పెద్దలు శ్రీ క్రిష్ణంరాజుకు.. ‘మీకు తెలుసు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) తెలుగుసినీ రంగానికి సంబంధించిన ఒక విశిష్ట సంస్థ. సమున్నత లక్ష్యాల సాతన కోసం అందరూ సమిష్టిగా తమ తమ ఆలోచనలు.. అభిప్రాయల్ని పంచుకొని ‘మా’ను ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ‘మా’కు నేను వ్యవస్థాపక అధ్యక్షుడిని అయినందుకు.. ఇప్పటికి ఒక సభ్యుడిగా కొనసాగుతున్ందుకు దానిని నేను గౌరవంగా పరిగణిస్తుంటాను. ‘మా’ సభ్యతవ్ం కలిగిన ప్రతి ఒక్కరిలోనూ అదే భావన ఉంటుంది. ‘మా’కు కొన్ని విధివిధానాలను ఏర్పర్చుకొని నిర్ణీత కాల వ్యవధికి పని చేసే కార్యవర్గాన్ని సభ్యుల ఓటింగ్ ద్వారా ఎన్నుకునే ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరిస్తున్నాం.

ప్రతి రెండేళ్లకు మార్చి నెలలో నిర్వహించుకునే ‘మా’ కార్యవర్గ ఎన్నిక ప్రక్రియ ఈసారి కొవిడ్ పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం కొనసాగుతున్నది ఆపద్ధర్మ కార్యవర్గమే. ఎన్నికలు నిర్వహించకుండా ఆపద్ధర్మ కార్యకవర్గాన్ని ఎక్కువ కాలం కొనసాగించటం మంచిది కాదు. ప్రస్తుత కార్యకవర్ానికి నిర్ణయాలు తీసుకునే నైతిక హక్కు ఉండదు కనుక వీలైనంత త్వరగా మనం కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి.

జాప్యం లేకుండా ‘మా’ ఎన్నికలు వెంటనే జరగాలి. తెలుగు సినీ రంగంలో గౌరవనీయ వ్యక్తిగా.. సీనియర్ గా.. డిసిప్లినరీ కమిటీ ఛైర్మన్ గా మీ మార్గదర్శకత్వంలో మా ఎన్నికలు నిర్వహించటానికి అనుకూలంగానే ఉన్నాయి. ఇటీవల కాలంలో బార్ కౌన్సిల్ ఎన్నికలు.. ఇంకా మరికొన్ని ప్రతిష్ఠాత్మక సంస్థల ఎన్నికలు కొవిడ్ ప్రోటోకాల్ ను పాటిస్తూ విజయవంతంగా నిర్వహించుకున్నారని నాకు తెలిసింది.

ఎన్నికల తర్వాత ఏర్పడే నూతన కార్యవర్గం ‘మా’కు సంబంధించిన అజెండాలో పెండింగ్ లో ఉన్న అంశాలన పరిష్కరించటానికి క్రషి చేస్తుంది. ఆచరణాత్మకమైన విధానంలో వివిధ కార్యక్రమాలను చేపడుతుంది. ఏ విధంగా చూసినా.. తక్షణం ‘మా’కు ఎన్నికలు జరగటం అనివార్యం. కోవిడ్ వల్ల.. ఈ మార్చి నెలలో జరగవలసిన ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి కనుక సెప్టెంబరు మాసంలో జరిగే ఎన్నికల తర్వాత ఏర్పడే నూతన కార్యవర్గం ‘మా’కు సంబంధించిన అజెండాలో పెండింగ్ లో ఉన్న అంశాల్ని పరిష్కరించటానికి క్రషి చేస్తుంది. ఆచరణాత్మకమైన విధానంలో వివిధ కార్యక్రమాలను చేపడుతుంది. ఏ విధంగా చూసినా.. తక్షణం ‘మా’కు ఎన్నికలు జరగటం అనివార్యం.

కొవిడ్ వల్ల.. ఈ మార్చిలో జరగవలిసిన ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. కనుక సెప్టెంబర్ లో జరిగే ఎన్నికల తర్వాత ఏర్పడే నూతన కార్యవర్గం కాలవ్యవధిని 2024 మార్చి వరకు కొనసాగించి.. మళ్లీ అక్కడ నుంచి పూర్వపు విధానంలోనే ప్రతి రెండేళ్లకు మార్చి నెలలో ‘మా’ ఎన్నికలు జరిగేలా మీరు నిర్ణయం చేయాలని కోరుతున్నాను. ఈ సూచనను పరిశీలించగలరు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశంలో ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద రంగాల్లో సినీ రంగం ప్రధానమైనది. ఇక్కడ కూడా సినీ రంగంలో జరిగే పరిణామాల పట్ల ప్రజలు ఎక్కువ ఆసక్తిని ప్రదర్శించటం సహజం.

అందువల్ల ‘మా’ వంటి సంస్థలు చేపట్టే కార్యక్రమాలు ఎటువంటి వివాదాలకు తావు లేకుండా పారదర్శకంగా ఉండాలి. సినీ రంగం ప్రతిష్టను పెంచే విధంగా ‘మా’ పని తీరు ఉండాలి. సంస్థలో క్రమశిక్షణ అత్యంత ముఖ్యం. ‘మా’ విధివిధానాలకు  అందరూ కట్టుబడాలి. ఇటీవల ‘మా’ సభ్యులు కొందరు మీడియా ముందుకు వెళ్లి తమ వ్యక్తిగత అభిప్రాయాలను వెలిబుచ్చటం వల్ల గందరగోళం ఏర్పడుతున్నది. ఈ పద్దతిని క్రమబద్ధీకరించాలి.

తెలుగు సినీ పరిశ్రమకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు.. గౌరవం లభించాయంటే అందుకు ఏ ఒక్కరో కారణం కాదు. అందరికీ ఇందులో భాగస్వామ్యం ఉంది. అది కొనసాగాలని.. చిన్న చిన్న అభిప్రాయభేదాలు.. మనస్పర్తలు ఉంటే.. వాటిని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలే తప్ప ఒకొరినొకరు బహిరంగంగా విమర్శించుకోవటం ఏ ఒక్కరికీ సరియైనది కాదన్నది నా అభిప్రాయం. మీకు అన్ని విషయాలు తెలుసు. మీ మాటకు తెలుగు చిత్రసీమ ఎనలేని గౌరవం ఇస్తుంది. మీ మార్గదర్శకత్వంలో ‘మా’ చుట్టూ నెలకొన్న చిన్న చిన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని, అందరి మధ్య సుహ్రద్భావ వాతావరణం ఏర్పడుతుందని ఆశిస్తున్నాను’ అంటూ ముక్తాయించారు.