Begin typing your search above and press return to search.
బ్రహ్మాజీ వారసుడికి మెగా ఆశీస్సులు
By: Tupaki Desk | 29 Feb 2020 10:30 AM ISTపరిశ్రమ పెద్దన్నగా చిన్న సినిమాల ప్రచారానికి మెగాస్టార్ కొండంత అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. నవతరం హీరోల్ని ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. నేరుగా యూనిట్ ని తన ఇంటికే ఆహ్వానించి సీడీ లాంచ్...టీజర్ ఆవిష్కరణలకు సహకరించారు. తనకు వీలున్నప్పుడల్లా కాదనకుండా వేదిక వద్దకే విచ్చేసి సర్ ప్రైజ్ చేస్తుంటారు. ఆ రకంగా దర్శకరత్న దాసరి నారాయణరావు లేని లోటును మెగాస్టార్ కొంత వరకూ తీర్చగలుగుతున్నారు. పెద్దాయనలాగే చిరంజీవీ కూడా చిన్న సినిమాలే పరిశ్రమకు ముఖ్యం...చిన్న సినిమాల వల్లే పరిశ్రమ నిలబడుతుందని ఇటీవల గళం వినిపిస్తుండడం పరిశ్రమలో ఉత్సాహం నింపుతోంది.
పరిశ్రమ కళకళలాడాలంటే సక్సెస్ తప్పనిసరి అని మెగాస్టార్ బలంగా ప్రచారం చేస్తున్నారు. ఇక నటవారసుల్ని ఆయన ఎంకరేజ్ చేస్తున్న తీరు ఆసక్తికరం. తాజాగా నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ హీరోగా పరిచయమవుతోన్న `ఓ పిట్ట కథ` ప్రీ రిలీజ్ వేడుక కు మెగాస్టార్ ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నారు. మార్చి 1న ఈ వేడుక హైదరాబాద్ -ఐటీసీ కోహినూర్ లో గ్రాండ్ గా జరగనుంది. ఈ కార్యక్రమానికి చిరు గెస్ట్ గా విచ్చేస్తున్నట్లు ఓ ప్రమోషనల్ పోస్టర్ ని భవ్య క్రియేషన్స్ టీమ్ రిలీజ్ చేసారు.
ఈ సందర్భంగా చిరు రాకను ఉద్దేశించి నిర్మాత ఆనంద ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మెగాస్టార్ ఎంట్రీతో మా సినిమాకు మంచి ఊపు వస్తుంది. ఆయన మా ఫంక్షన్ కు రావడం అదృష్టంగా భావిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. బ్రహ్మాజీ సైతం చిరు రాకపై సంతోషం వ్యక్తం చేసారు. తన బిడ్డను ఆశీర్వదించడానికి వస్తున్న చిరంజీవి గారికి ఎప్పటికి రుణపడి ఉంటానని ఆయన తెలిపారు.