Begin typing your search above and press return to search.

అమెరికాలో మెగాస్టార్ రంగస్థలం సంబరాలు

By:  Tupaki Desk   |   28 April 2018 6:34 AM GMT
అమెరికాలో మెగాస్టార్ రంగస్థలం సంబరాలు
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో రంగస్థలం సినిమా మంచి గుర్తింపు తెచ్చిందని చెప్పవచ్చు. నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసిన ఈ సినిమా అటు నిర్మాతలకు ఇటు బయ్యర్స్ కి మంచి లాభాలను అందించింది. ఇక అమెరికాలో మన టాలీవుడ్ మార్కెట్ ప్రతిసారి పెరుగుతోంది అనడానికి ఈ చిత్రం ఒక ఉదాహరణగా నిలిచింది. వేగంగా 2 మిలియన్ డాలర్లను అందుకొని అందరిని షాక్ కి గురి చేసింది.

ఈ విజయంతో మెగా ఫ్యామిలిలో సరికొత్త సంబరాలు మొదలయ్యాయి. సినిమా సరికొత్తగా అనిపించడంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేసింది. ఇకపోతే అందరికంటే ఎక్కువగా మెగా స్టార్ చిరంజీవి సినిమా రిజల్ట్ పట్ల చాలా సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికాలో మా అసోసియేషన్ కి సంబందించిన పనుల్లో బిజీగా ఉన్న మెగాస్టార్ పనిలో పనిగా అక్కడ రంగస్థలం విజయాన్ని సెలబ్రేట్ చేసుకోనున్నారు.

అందుకు తగిన ఏర్పాట్లను మెగా అభిమానులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోజు మూడు గంటలకు రెగల్ మేకార్తుర్ ఇర్వింగ్ TX లో ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో మెగా అభిమానులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. రంగస్థలం సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సమంత హీరోయిన్ నటించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.