Begin typing your search above and press return to search.

ఐకానిక్ సీన్ తో బాస్ పూన‌కాలు తెప్పిస్తాడా?

By:  Tupaki Desk   |   17 Dec 2022 12:30 PM GMT
ఐకానిక్ సీన్ తో బాస్ పూన‌కాలు తెప్పిస్తాడా?
X
మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న మాసీవ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `వాల్తేరు వీర‌య్య‌`. బాబి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని అత్యంత ప్ర‌త‌ష్టాత్మ‌కంగా మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మిస్తున్నారు. శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా మాస్ మ‌హారాజా ర‌వితేజ కీల‌క అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. `ఆచార్య‌` మూవీ ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌క‌పోగా భారీ డిజాస్ట‌ర్ గా నిలిచి షాకివ్వ‌డం.. `గాడ్ ఫాద‌ర్‌` కూడా చెప్పుకోద‌గ్గ స్థాయిలో స‌క్సెస్ కాక‌పోవ‌డంతో చిరు ఈ మూవీపై ప్ర‌త్యేక శ్ర‌ద్ద తీసుకుంటున్నార‌ట‌.

2023 సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13న భారీ స్థాయిలో ఈ మూవీని రిలీజ్‌చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన బాస్ పార్టీ సాంగ్ .. తాజాగా చిరు లీక్ చేసిన `నువ్వు శ్రీ‌దేవైతే.. ` పాట‌లు మెగా ఫ్యాన్స్ ని విశేఫంగా ఆక‌ట్టుకుంటూ సినిమాపై మైప్‌ని క్రియేట్ చేస్తున్నాయి. ఇక రీసెంట్ గా మాస్ మ‌హారాజా క్యారెక్ట‌ర్ ని ప‌రిచ‌యం చేస్తూ రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్‌ గ్లిమ్స్ సినిమా మ‌రింత ఎంట‌ర్ టైన్ మెంట్ ని పంచుతూనే ప‌వ‌ర్ ఫుల్ గా సాగుతుంద‌నే సంకేతాల్ని అందించింది.

ఈ మూవీలో ర‌వితేజ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ విక్ర‌మ్ సాగ‌ర్ గా క‌నిపించ‌బోతున్నాడు. ఇందులో చిరు నెవ‌ర్ బిఫోర్ అవ‌తార్ లో క‌నిపిస్తున్న విష‌యం తెలిసిందే. గ‌ల్ల లుంగీ.. చార‌ల చొక్కాతో మాస్ ట్రీట్ ఇస్తూ ముఠా మేస్త్రీ, అంద‌రివాడు టైమ్ ని గుర్తు చేయ‌బోతున్నాడు. ఈ రెండు సినిమాల త‌రువాత చిరు ఊర మాసీవ్ మేకోవ‌ర్ తో క‌నిపించనున్న ఈ మూవీలో ఓ క్రేజీ ఫైట్ సీక్వెన్స్ వుంద‌ట‌. ఇది సినిమాకు ప్ర‌ధాన హైలైట్ గా నిలుస్తుంద‌ని తెలుస్తోంది.

ద‌ర్శ‌కుడు బాబి సోష‌ల్ మీడ‌యా వేదిక‌గా చిరు స్లైల్ గా కూర్చుని, క‌ళ్ల‌కు గాగుల్స్ పెట్టుక‌ని చేతికి సంకెళ్ల‌తో.. వెన‌కాల గ‌న్స్ పేర్చిన‌ట్టుగా క‌నిపిస్తున్న లుక్ ని విడుద‌ల చేస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఈ పోస్ట‌ర్ సాంపిల్ మాత్ర‌మే. ప్రామిస్ చేస్తున్నా ఈ సీన్ లో థియేట‌ర్లో పూన‌కాలు గ్యారంటీ` అంటూ ట్వీట్ చేశాడు. ఇంత‌కీ ఈ సీన్ వెన‌కున్న స్టోరీ ఏంటీ.. బాబీ ఇంత‌గా ఎందుకు చెబుతున్నాడ‌ని ఆరా తీస్తే ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఒక‌టి తెలిసింది. చిరు కెరీర్ ని మ‌లుపు తిప్పిన సినిమా `ఖైదీ`. ఈ మూవీలోని పోలీస్టేస‌న్ సీన్ హైలైట్ గా నిలిచిన విష‌యం తెలిసిందే.

అలాంటి ఐకానిక్ సీన్ ని `వాల్తేరు వీర‌య్య‌`లో రిపీట్ చేస్తున్నార‌ట‌. సినిమాలో పోలీస్టేస‌న్ లో ఓ భారీ యాక్ష‌న్ సీక్వెన్స్ ని చిరుపై ద‌ర్శ‌కుడు బాబీ ప్లాన్ చేశాడ‌ట‌. ఈ ఫైట్ థియేట‌ర్ల‌లో ఫ్యాన్స్ కి పూన‌కాలు తెప్పించ‌డం ఖాయం అని తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.