Begin typing your search above and press return to search.

మొదటిసారి.. చిరంజీవికి టెస్ట్ షూట్

By:  Tupaki Desk   |   16 Nov 2017 5:39 PM GMT
మొదటిసారి.. చిరంజీవికి టెస్ట్ షూట్
X
టాలీవుడ్ పై బాలీవుడ్ - కోలీవుడ్ మరోసారి కన్నేసే సమయం స్టార్ట్ అయ్యింది. బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక చిత్రం తెరకెక్కుతున్నప్పుడు తెలుగు మీడియా కంటే నార్త్ మీడియా ఓ రేంజ్ లో హల్ చల్ చేసింది. ఇక ఇప్పుడు మెగాస్టార్ ప్రతిష్టాత్మక చిత్రం సైరా తెరకెక్కుతుండడంతో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ను కవర్ చేస్తోంది. ఇప్పటికే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొత్తం పూర్తి చేసుకుంది.

అయితే రీసెంట్ గా అందిన సమాచారం ప్రకారం చిరంజీవి తన జీవితంలో మొదటి సారి టెస్ట్ షూట్ లో పాల్గొన్నారు. కెరీర్ మొదట్లో కూడా మెగాస్టార్ ఈ స్థాయిలో టెస్ట్ షూట్ చేయలేదు. కానీ సైరా సినిమాపై అంచనాలు మాములుగా లేవులే. అంతే కాకుండా ప్రముఖ దిగ్గజ నటులు అండ్ టెక్నీషియన్స్ సినిమాలో భాగం కాబోతున్నారు. అందులోని చారిత్రాత్మక చిత్రం కాబట్టి రెగ్యులర్ కమర్షియల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాను చేయగలడా? అని అందరిలోను ఒక అనుమానం దాగి ఉంది. అయితే చిరు తన క్లారిటీ కోసం రెండు రోజుల వరకు డైరెక్టర్ చేత కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను టెస్ట్ షూట్ చేయించాడట. ఇలా పాత్ర కోసం టెస్ట్ షూట్ చేయడం చిరంజీవికి కూడా ఇదే మొదటిసారి.

ఇక తాను కూడా పూర్తిగా ఫుల్ కాస్ట్యూమ్ తో షూట్ లో పాల్గొని ఒకసారి తన లుక్ ని అంతా చెక్ చేసుకున్నాడట చిరు. మొత్తంగా మెగాస్టార్ సురేందర్ రెడ్డి వర్క్ - కాన్ఫిడెన్స్ ని చూసి సంతృప్తి చెందరాట. ఇక దైర్యంగా షూటింగ్ ని స్టార్ట్ చేయొచ్చు అని నిర్ణయంచుకున్నారని కూడా తెలుస్తోంది. సైరా సినిమా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అంజనా ప్రొడక్షన్ పై రామ్ చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఏఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.