Begin typing your search above and press return to search.
చిరు ఆటపట్టిస్తున్నారా? లేక సర్ ప్రైజ్ చేస్తున్నారా?
By: Tupaki Desk | 26 April 2022 8:00 AM ISTనచ్చిన స్టార్ ఏడాదికి రెండు సినిమాలు చేస్తూ అబ్బో సూపర్ అనుకుంటాం. అంతకు మించి చేస్తే ఓహో అంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. అంతకు మించి అంటే నాలుగైదు ప్రాజెక్ట్ లకు మించి ప్రకటిస్తే ఇది నిజమా కలా? అని ఆలోచనలో పడతాం. నమ్మాలా వద్దా అని ఆలోచిస్తాం. ఇప్పడు మెగాస్టార్ చిరంజీవి అభిమానులు పరిస్థితి కూడా ఇలాగే వుందని వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ మునుపెన్నడూ లేనంతగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ షాకిస్తున్నారు.
చిరు నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు దాటుతోంది. ఈ నేపథ్యంలో ఎప్పుడెప్పుడు చిరు సినిమా థియేటర్లలో సందడి చేస్తుందా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ సర్ ప్రైజ్ లు ఇస్తున్నారు మెగాస్టార్ . ఇప్పటికే ఓ సినిమాని పూర్తి చేసి రిలీజ్ కు రెడీ చేసిన చిరంజీవి మరో మూడు నాలుగు చిత్రాలని లైన్ లో పెట్టడం తో ఫ్యాన్స్ చిరులో ఏంటీ స్పీడు అంటూ ఆశ్చర్యపోతున్నారు. మెగాస్టార్ నటించిన `ఆచార్య` చిత్రం ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.
కొరటాల శివ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీమతి సురేఖ సమర్పణలో నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి పలు మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భగా పలు ఆసక్తికర విశేషాలని వెల్లడిస్తున్న చిరు కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ఆసక్తికర విషయాల్ని పంచుకుంటున్నారు.
అయితే ఇప్పటికే మూడు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తూ క్షణం తీరిక లేకుండా బిజీగా గడిపేస్తున్న చిరు మరిన్ని ప్రాజెక్ట్ లు లైన్ లో వున్నాయని, మరో ఐదు సినిమాలని ఓకే చేయబోతున్నానని ప్రకటిస్తుండటం అభిమానులని షాక్ కు గురిచేస్తోంది. చిరు నిజంగానే చెబుతున్నారా? లేక ఆటపట్టిస్కతున్నారా? అని ఫ్యాన్స్ వాపోతున్నారట. `ఆచార్య` తరువాత చిరు మరో మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. మోహన్ రాజా డైరెక్షన్ లో `గాడ్ ఫాదర్`, మెహర్ రమేష్ తో `భోళా శంకర్` చిత్రాలతో పాటు బాబీ తో `వాల్తేరు వీరయ్య` మూవీ చేస్తున్నారు.
ఈ మూడు చిత్రాలు ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. అంతే కాకుండా డీవీవీ దానయ్య నిర్మాణంలో వెంకీ కుడుముల డైరెక్ట్ చేయనున్న మూవీని ఇప్పటికే ప్రకటించారు కానీ ఇంత వరక ఈ మూవీ పట్టాలెక్కకపోవడంతో ఇది వుంటుందా? అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ఇన్ని ప్రాజెక్ట్ లు లైన్ లో వున్న ఆచిరు తాజా ఇంటర్వ్యూలో మరో ఐదు ప్రాజెక్ట్ లు చర్చలదశలో వున్నాయని చెప్పడం ఫ్యాన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. చిరు నిజంగానే ఐదు ప్రాజెక్ట్ లు చేయబోతున్నారా? లేక ఆటపట్టిస్తున్నారా? అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారట.