Begin typing your search above and press return to search.

'తుపాకీ డాట్ కామ్' కు మెగాస్టార్ దీపావళి కానుక..!

By:  Tupaki Desk   |   8 Nov 2021 3:36 PM GMT
తుపాకీ డాట్ కామ్ కు మెగాస్టార్ దీపావళి కానుక..!
X
సినీ అభిమానులు మెగాస్టార్ చిరంజీవి ని ఎంతగా అభిమానిస్తారో.. ఆరాధిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మూడు దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న చిరు.. ఇండస్ట్రీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అలానే ఎంతోమందికి సేవ చేసి రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకున్నారు. బ్లడ్ బ్యాంక్ - ఐ బ్యాంక్ లతో పాటుగా ఆక్సిజన్ బ్యాంకులు నెలకొల్పి ఎంతోమంది ప్రాణాలకు భరోసా కల్పిస్తున్నారు. ఆపదలో ఉన్నవారికి ఆపద్భాందవుడిగా మారిన చిరంజీవి.. మహోన్నత శిఖరంగా ఎదిగారు. ఇప్పుడు మెగా వారసుడు రామ్ చరణ్ కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారు. నటవారసత్వాన్ని పునికిపుచ్చుకోవడమే కాకుండా సేవాగుణంలోనూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. అలాంటి మెగా తండ్రీకొడుకులు 'తుపాకీ డాట్ కామ్' కు ప్రత్యేకంగా దీపావళి కానుకలు పంపించారు.

కొణిదెల చిరంజీవి మరియు రామ్ చరణ్ దీపావళి పండుగను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సినీ ప్రముఖులకు, సన్నిహితులకు శ్రేయోభిలాషులకు కానుకలు పంపించారు. ఇందులో భాగంగా 'తుపాకీ డాట్ కామ్' కు కూడా విషెస్ అందిస్తూ గిఫ్ట్ ప్యాక్ అందించారు. దీనికి తుపాకీ టీమ్ ఆనందం వ్యక్తం చేస్తూ చిరంజీవి - చరణ్ లకు కృతజ్ఞతలు తెలుపుతోంది. దీన్ని ప్రోత్సాహంగా భావిస్తూ మున్ముందు తెలుగు సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను సినీ అభిమానులకు చేరవేస్తూ.. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తమవంతు మద్దతు అందిస్తామని తెలియజేస్తున్నాం.

'తుపాకీ డాట్ కామ్' గత కొన్నేళ్లుగా అగ్రగామి ఆన్ లైన్ వెబ్ పోర్టల్ గా కొనసాగుతోంది. సినీ రాజకీయ క్రీడా ఆర్థిక వివరాలను.. సంఘటనలను ఎప్పటికప్పుడు వార్తల రూపంలో ప్రజలకి చేరువ చేయడంలో వేగంగా పని చేస్తోంది. ఈ క్రమంలో ఎన్నో ఎక్స్ క్లూజివ్ స్టోరీలను దైర్యంగా పాఠకులకు అందించడం జరిగింది. స్వతంత్ర సంపాదకీయ బృందం - రియల్ టైం రిపోర్టర్స్ అండ్ స్ట్రింగర్స్ కలిగిన తుపాకీ.. దేశ విదేశాలలో నివసిస్తున్న తెలుగు వారి పట్ల గౌరవంతో అపారమైన ప్రజాదరణను పొందుతోంది. పాఠకుల సౌకర్యార్థం తెలుగుతో పాటుగా ఇంగ్లీష్ భాషలోనూ న్యూస్ అందిస్తోంది. అందుబాటులో ఉన్న సాంకేతికను ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు ఆర్షణీయంగా వెబ్ సైట్ ను తీర్చిదిద్దడం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించిన ప్రత్యేక కథనాలు.. లైవ్ న్యూస్.. సినిమా అప్డేట్స్ అందించడంలో వేగవంతమైన వెబ్ పోర్టల్ గా 'తుపాకీ డాట్ కామ్' పరిగణించబడుతోందని చెప్పడానికి మేం సంతోషిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించేలా కృషి చేస్తామని.. సైట్ మీద ప్రజల ఆదరాభిమానాలు ఇలానే కొనసాగేలా చూసుకుంటామని 'తుపాకీ డాట్ కామ్' తెలియజేస్తోంది.