Begin typing your search above and press return to search.
ప్రేమతో కూతురును కొట్టిన చిరంజీవి
By: Tupaki Desk | 29 March 2016 1:41 PM ISTమెగా వెడ్డింగ్ ముగిసింది. కళ్యాణ్ తో శ్రీజ పెళ్ళయిపోయింది. అయితే పెళ్ళి సందర్భంగా ముందు రోజు జరిగిన సంగీత్ కార్యక్రమంలో మెగాస్టార్ కూడా డ్యాన్సులతో ఇరగదీశారు. ప్రస్తుతం ఆయన తన పెద్ద కూతురు సుస్మితతో కలసి డ్యాన్సు చేసిన ఒక వీడియో వెబ్ లో హల్‌చల్ చేస్తోంది.
పెద్ద కూతురు సుస్మిత పట్టుబట్టడంతో.. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అనే పాటకు చిరంజీవి స్టెప్పేశారు. రాక్షసుడు సినిమాలో సుహాసినితో కలసి కాశ్మీర్ అందాల చాటున చిరంజీవి ఆ పాటలో తన ఫ్లూయిడ్ అండ్ గ్రేస్ మూమెంట్లతో అప్పట్లో అందరినీ ఎలా ఊర్రూతలూగించారో తెలిసిందే. అయితే ఈ రొమాంటిక్ మెలోడీకి కూతురితో కలసి స్టెప్పులు వేయడం ఏంటి? సరిగ్గా చిరంజీవి కూడా ఈ అల్లరిని చూసి అలాగే ఫీలయ్యారు. అందుకే డ్యాన్సు వేస్తూనే సుస్మిత తలపై ఒక్కటిచ్చారు. ప్రేమగా యన కొట్టిన ఆ దెబ్బ.. అందరినీ నవ్వుల్లోకి నెట్టేసింది. సుస్మిత కూడా నవ్వుతూనే డ్యాన్సు కంటిన్యూ చేసింది. ఒక పల్లవికి స్టెప్పేసి వెళ్ళిపోతున్న చిరును.. కూతురు సుస్మిత ఆగండి డాడీ అంటూ పిలవడం వరకే ఈ వీడియో ఉందిలే.
మొత్తానికి సంగీత్ కార్యక్రమంలో చిరంజీవి తన డ్యాన్సు కిక్ ను తన కుటుంబానికీ బంధువులకీ పంచారనమాట.