Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ టైమ్ లో నలభీముడిని నిద్ర లేపుతున్న మెగాస్టార్...!
By: Tupaki Desk | 6 May 2020 12:00 PM ISTమెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఎంత జోరు చూపిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీ ఎంట్రీ తర్వాత ఆయనలో కొత్త జోష్ వచ్చింది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు మెగాస్టార్. వరుస సినిమాలను ఓకే చేస్తూ ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నాడు. గతేడాది 'సైరా నరసింహారెడ్డి' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత చిరంజీవి మలయాళంలో హిట్టైన 'లూసీఫర్' సినిమాను సుజిత్ దర్శకత్వంలో రీమేక్ చేయబోతున్నాడు. ఆ తర్వాత మెహర్ రమేష్ తో పాటు బాబీతో సినిమాలు చేస్తున్నట్టు ప్రకటించాడు. కాగా ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా 'ఆచార్య' షూటింగ్ రద్దు చేసుకొని ఇంట్లో ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నాడు మెగాస్టార్. రీసెంటుగా సోషల్ మీడియాలో అడుగుపెట్టిన చిరు యాక్టీవ్ గా ఉంటూ లాక్ డౌన్ సమయంలో టైంపాస్ చేస్తున్నాడు. అంతేకాకుండా తనలోని నలభీముడిని నిద్ర లేపుతున్నాడు. వేడి వేడి దోశలు వేసి తన తల్లికి తినిపిస్తున్నాడు. ముఖ్యంగా ఆ దోశ రెడీ చేసేప్పుడు మెగాస్టార్ దోశను ప్లిప్ చేసిన విధానం చూస్తేనే అర్థం అవుతుంది మెగాస్టార్ కి ఆల్రెడీ కుకింగ్ లో ప్రావీణ్యం ఉందని.
ఈ నేపథ్యంలో ఒక ప్రముఖ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కుకింగ్ హ్యాబిట్ గురించి చెప్పుకొచ్చాడట మెగాస్టార్. 'నేను వంటలు బాగా చేస్తాను. కానీ అంత టైమ్ ఎప్పుడూ దొరకలేదు. టైమ్ దొరికితే మాత్రం వంటలు చేయడానికి ఇష్టపడతాను. ఎక్కువగా చేపల కూర.. మటన్ వేపుడు చేయడానికి ఇష్టపడతాను. వీటికంటే ముందుగా చెప్పాలంటే ఫ్రైడ్ రైస్.. నూడిల్స్ లాంటి చైనీస్ వంటకాలు కూడా చేయగలను' అని చిరు చెప్పుకొచ్చాడట. అంతేకాకుండా 'పెళ్లయిన కొత్తలో నా భార్యకు వంట చేయడం రాదు.. వంటల్లో ఆమెకు తొలి గురువు నేనే.. ఫస్ట్ టైమ్ ఆమెకు ఉప్మా చేయడం నేర్పించాను. అప్పట్లో ఆమెకు అది కూడా చేయడం రాదు. కుటుంబంతో సరదాగా గడపడానికి.. వాళ్లతో ఇంటరాక్ట్ అవ్వడానికి వంట చేయడం అనేది ఓ మంచి మార్గం అని నేను భావిస్తాను. అందుకే టైమ్ దొరికినప్పుడల్లా గరిటె తిప్పేస్తాను. వంట చేయడాన్ని నేను ఎంజాయ్ చేస్తాను' అని మెగాస్టార్ తెలిపారు. మెగాస్టార్ యాక్టింగ్ చించేస్తారు.. డాన్స్ ఇరగదీస్తారు. ఇవన్నీ అందరికీ తెలిసినవే. కానీ ఆయనలో ఈ కోణం కూడా ఉందని సినీ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. లాక్ డౌన్ మరికొన్ని రోజులు పొడిగించారు.. ఈ నేపథ్యంలో చిరు తన ఫ్యామిలీకి ఇంకెన్ని రుచులు అందిస్తారో చూడాలి.