Begin typing your search above and press return to search.

బ‌ర్త్ డే ట్రీట్: అన్న‌య్య స‌న్నిధి అదే నాకు పెన్నిధి

By:  Tupaki Desk   |   29 Oct 2020 2:21 PM IST
బ‌ర్త్ డే ట్రీట్: అన్న‌య్య స‌న్నిధి అదే నాకు పెన్నిధి
X
అన్న‌య్య స‌న్నిధి అదే నాకు పెన్నిధి.. ఈ దృశ్యం చూస్తే అలా ప్లెజెంట్ గా విజిల్ వింటున్న‌ట్టుగా అనిపించ‌‌డం లేదూ? ప‌రిశ్ర‌మ పెద్ద‌న్న మెగాస్టార్ చిరంజీవి ఓ వేడుక‌కు విచ్చేశారంటే ఆ లుక్కే వేరు. అన్న‌య్య స్వ‌యంగా ఇలా వ‌చ్చి బ‌ర్త్ డే కేక్ క‌ట్ చేయిస్తుంటే నాగ‌బాబు మోములో ఏదో తెలీని ఆనందం ... ఆ మోములో ఆ చిరున‌వ్వు ఇట్టే చెప్పేస్తోంది. దాచాల‌న్నా దాగ‌ని ఆనందం ఇది.

రేర్ మూవ్ మెంట్ ని అలా సెల‌బ్రేట్ చేస్తున్నారు. ఇక నాగ‌బాబు మెడ‌లో అభిమానులు ఆర‌డుగుల బుల్లెట్టు లాంటి గులాబీల దండ వేసి అభిమానం చాటుకున్నారు చూశారుగా.. ఈ కార్య‌క్ర‌మంలో చిరంజీవి యువ‌త అధ్య‌క్షుడు ర‌మ‌ణం స్వామినాయుడు ఉన్నారు. జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ లో ఇలా బ‌ర్త్ డే కార్య‌క్ర‌మాలు చేసిన ప్ర‌తిసారీ బ్ల‌డ్ ఇవ్వడం అల‌వాటు. మెగా కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు చిరంజీవి అభిమానులు కూడా ర‌క్త‌దానం చేసి సేవాకార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఇది అంద‌రికీ ఆద‌ర్శ‌నీయం అనుస‌ర‌నీయం అని ప్రూవ్ చేస్తుంటారు.

ఓవైపు నాగ‌బాబు రియాలిటీ షోల‌తో బిజీ. అదిరింది కార్య‌క్ర‌మానికి ఆయ‌న న‌వ్వే కిక్కు. జ‌బ‌ర్ధ‌స్త్ నుంచి వెళ్లాక అదిరిందికి రేటింగ్ తెచ్చే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారాయ‌న‌. ఇక‌పోతే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య షెడ్యూల్ కోసం వేచి చూస్తున్నారు. తీరిక వేళ‌ల్లో ఇలా కుటుంబ స‌భ్యుల‌తో విలువైన స‌మ‌యాన్ని స్పెండ్ చేస్తున్నారు. క‌రోనా క‌ష్ట‌కాలంలో త‌ల‌సేమియా వ్యాధిగ్రస్తుల‌కు యాక్సిడెంట్ అయిన‌వారికి రక్తాన్ని దాన‌మిచ్చిన బ్ర‌ద‌ర్స్ అభిమానుల్లానే ప్ర‌జానీకం కూడా ర‌క్త‌దానానికి ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు.