Begin typing your search above and press return to search.

మెగా ట్విట్టర్ ప్రయాణం.. అర్థ మిలియన్ పూర్తి!

By:  Tupaki Desk   |   18 May 2020 4:20 PM IST
మెగా ట్విట్టర్ ప్రయాణం.. అర్థ మిలియన్ పూర్తి!
X
మెగాస్టార్ చిరంజీవి మార్చ్ లో ట్విట్టర్ ఖాతా తెరిచిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి యాక్టివ్ గా ఉంటూ తరచుగా అప్డేట్లు ఇస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇక చిరు బాటలో తనయుడు రామ్ చరణ్ కూడా ట్విట్టర్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. మరీ మెగాస్టార్ అంత జోరు చూపించడం లేదు కానీ అప్డేట్లు ఇస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నారు. తాజాగా మెగా డాడ్.. మెగా సన్ ఇద్దరూ ట్విట్టర్ లో అర్థ మిలియన్ ఫాలోయర్ మార్కును దాటడం విశేషం.

చిరంజీవి ట్విట్టర్ ఖాతాకు ప్రస్తుతం 508k ఫాలోయర్లున్నారు. ఇదే చరణ్ ఖాతాకు 505k అనుచరులున్నారు. ప్రస్తుతం చిరంజీవి.. చరణ్ ల జోరు చూస్తుంటే మరో రెండుమూడు నెలల లోపే వన్ మిలియన్ ఫాలోయర్ల మార్క్ చేరుకుంటారని అంటున్నారు. నిజానికి గతంలో పోలిస్తే ట్విట్టర్ లో ఇప్పుడు ఎక్కువమంది యువత యాక్టివ్ గా ఉండడం లేదు. ఇన్స్టా గ్రామ్.. టిక్ టాక్ లాంటి ఇతర సామాజిక మాధ్యమాలవైపు ఈ తరంవారు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. దీంతో ట్విట్టర్లో కొత్తగా జాయిన్ అయిన సెలబ్రిటీలకు ఫాలోయర్ల సంఖ్య భారీ స్థాయిలో పెరగడం లేదు. అదే టిక్ టాక్ లాంటివి రాక మునుపు సెలబ్రిటీలకు ఎక్కువ సంఖ్యలో ఫాలోయర్లు తక్కువ సమయంలో వచ్చేవారు.

చిరంజీవి.. చరణ్ ల సినిమాల రిలీజ్ సమయంలో ఎక్కువగా అప్డేట్స్ ఉంటాయి కాబట్టి ఆ సమయంలో ఫాలోయర్స్ నంబర్ పెరుగుతుందని అంటున్నారు. టాలీవుడ్ సెలబ్రిటీలలలో ట్విట్టర్ ఫాలోయింగ్ విషయంలో మహేష్ బాబు ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. మహేష్ కు 9 మిలియన్ల ట్విట్టర్ ఫాలోయర్లు ఉండడం గమనార్హం.