Begin typing your search above and press return to search.
స్నేహితురాలి కి మెగాస్టార్ మరోసారి చేయూత!
By: Tupaki Desk | 3 May 2022 12:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి హెల్పింగ్ నేచుర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకీయాల ద్వారా ప్రజాసేవకుడు కాలేకపోయినా ప్రత్యక్ష..పరోక్షంగా రోజు ఆయన సేవలు ప్రజలకు ఏదో రూపంతో అందుతూనే ఉంటాయి. కరోనా క్రైసస్ సమయంలో ఆయన అందించి సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమే. తెలుగు రాష్ర్టాల వ్యాప్తంగా ఆక్సిజట్ ప్లాంట్ ని ఏర్పాటు చేసి ఎంతో మందికి ఊపిరిపోసిన మహోన్నత వ్యక్తి. ఇటీవలే సినీ కార్మికుల కోసం కోట్ల రూపాయలు వెచ్చించి తానే స్వయంగా ఓ ఆసుపత్రి నిర్మించడానికి ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.
ఆయన గొప్పతనం..వ్యక్తిత్త్వం గురించి తెలంగాణ నాయకులు ఏ రేంజ్ లో ప్రశంసించారో కూడా చూసాం. ఇదంతా కేవలం మానవసేయవే మాధవ సేవ గా భావించి చేస్తున్నారు. ఇక తెలిసిన వాళ్లు కష్టాల్లో ఉన్నారంటే ఆదుకోవడంలో చిరంజీవి చోరవ గురించి చెప్పాల్సిన పనిలేదు. అదీ తన స్నేహితులు..శ్రేయోభిలాషులకు అయితే మీకు ముందు నేను ఉన్నానంటూ ముందుకొస్తారు.
అలా మరోసారి రాధికా-శరత్ కుమార్ దంపతులు కోసం చిరంజీవి ముందుకొస్తున్నట్లు సమాచారం. రాధిక వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టి నష్టపోయారుట. ఆమె నిర్మాణ సంస్థ రాడాన్ మీడియా పై పెద్ద గా సీరియల్స్ కూడా నిర్మించలేదు. కేవలం ఆర్ధిక నష్టాలు కారణంగానే ఇదంతా జరిగినట్లు తెలుస్తోంది. దీంతో రాధిక చిరంజీవిని సహాయం అడిగినట్లు సమాచారం.
ఇద్దరు చాలా కాలంగా మంచి స్నేహితులు. జంటగా చాలా సినిమాల్లో కలిసి నటించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అందుకే మరోసారి చిరంజీవి తను చేయగల్గినంత సహాయాన్ని చేస్తానని మాటిచ్చారుట. అయిత రాధికాశరత్ కుమార్ దంపతులకు చిరంజీవి ఇలా సహాయం చేయడం ఇది మొదటిసారి కాదు.
గతంలో రెండు..మూడు సందర్భాల్లో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోంటున్న సమయంలో చిరు ఇలాగే ఎంటర్ అయి ఆ దంపతుల్ని సమస్యల నుంచి బయట పడేసారు. ఈవిషయాన్ని శరత్ కుమార్ స్వయంగా వెల్లడించారు. ''తాను నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయని దాంతో నష్టాలను చవిచూసి ఆర్థికంగా ఇబ్బందులు పడ్డానని తెలిపారు. సరిగ్గా అదే సమయంలో సినీ పరిశ్రమకు చెందినటువంటి ఓ ప్రముఖ నిర్మాత మెగాస్టార్ చిరంజీవితో తాను నిర్మిస్తున్నసినిమాకి డేట్లు ఇప్పిస్తే ఆర్థిక పరంగా సహాయం చేస్తానని చెప్పడం..చిరంజీవి అందుకు వెంటనే ఒప్పుకోవడం గు రించి శరత్ కుమార్ ఓసందర్భంలో'' రివీల్ చేసారు.
ఇలాంటి సహకారాలు అందించడం లో మెగాస్టార్ ఎప్పుడూ ముందుంటారు. తన స్నేహితుల్ని తన సినిమాలతోనే నిర్మాతలుగా పరిచయం చేసి వాళ్లకి ఓ లైఫ్ ఇస్తుంటారు. అలాగే తన సినిమాల్లో పెట్టుబడులు పెట్టించి ఎంతో కొంత లాభాలు వచ్చేలే సహకరిస్తుంటారు. సినిమా నిర్మాతలు నష్టపోతే పారితోషికం రిటర్న్ చేస్తుంటారు. పంపిణీదారుల నష్టాల్ని తదుపరి సినిమా ఫలితాలతో బ్యాలెన్స్ చేస్తుంటారు. ఇదంతా కేవలం మెగాస్టార్ గొప్పతనమే అనాలి.