Begin typing your search above and press return to search.

మెగాస్టార్ బ‌ర్త్ డే..ట్రిపుల్ ట్రీట్ ఉంటుందా?

By:  Tupaki Desk   |   17 Aug 2022 1:30 AM GMT
మెగాస్టార్ బ‌ర్త్ డే..ట్రిపుల్ ట్రీట్ ఉంటుందా?
X
మెగాస్టార్ చిరంజీవి బ‌ర్త్ డేకి ఇంకా వారం రోజులే స‌మ‌యం ఉంది. ఆగ‌స్టు 22న తో మెగాస్టార్ 67వ ప‌డిలోకి అడుగుపెడ‌తారు. ఇక ఆరోజున ఫ్యాన్స్ హంగామా ఏస్థాయిలో ఉంటుందో? చెప్పాల్సిన ప‌నిలేదు. దేశ వ్యాప్తంగా అభిమానులు ఆ వేడుక‌ను ఓ పెద్ద పండుగ‌లా సెల‌బ్రేట్ చేస్తారు. తెలుగు రాష్ర్టాల అభిమాన సంఘాల హ‌డావుడి గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు.

ఛారిటీ పేరిట ఎన్నో సామాజిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుంటారు. మెగా బ్లడ్ క్యాపులు ఏర్పాటు చేస్తారు. అన్న‌ధాన కార్య‌క్ర‌మాలు పెద్ద ఎత్తున నిర్వ‌హిస్తారు. చిరు పేరిట గ్రాండ్ గా పార్టీలు సైతం జ‌రుగుతుంటాయి. ఇక ఈ స్పెష‌ల్ డేని మెగాస్టార్ అంతే ఘ‌నంగా నిర్వ‌హిస్తారు. ఇన్ని కార్య‌క్ర‌మాలు చేసినా అభిమానులకు చిరు నుంచి ట్రీట్ లేక‌పోతో ఎలా? ఆ ట్రీట్ త‌ప్ప‌ని స‌రి.

మ‌రి ఈసారి మెగా కాంపౌండ్ నుంచి ట్రిపుల్ ట్రీట్ వ‌చ్చే అవ‌కాశం ఉందా? అంటే అనొచ్చు. ప్ర‌స్తుతం మెగాస్టార్ ఏకంగా మూడు సినిమాల్ని లైన్ లో పెట్టిన సంగ‌తి తెలిసిందే. 153వ చిత్రంగా 'గాడ్ ఫాద‌ర్' తెర‌కెక్కుతోంది. ఇటీవ‌లే చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. తాజాగా చిరంజీవి డ‌బ్బింగ్ ప‌నులు కూడా మొద‌లుపెట్టిన‌ట్లు తెలుస్తోంది.

'ఆచార్య' త‌ర్వాత ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న చిత్ర‌మిది. దీంతో పుట్టిన రోజు కానుక‌గా గాడ్ ఫాద‌ర్ ఏదో రూపంలో ట్రీట్ ఇచ్చే అవ‌కాశం ఉంది. అది భారీగానే ఉంటుంద‌ని అభిమానులు అంచ‌నాలు పెట్టుకున్నారు. ఇక 154వ చిత్రం 'వాల్తేరు వీర‌య్య‌'కి బాబి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ సినిమా సెట్స్ లోఉంది. ఓ అభిమానిగా బాబి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

త‌న అభిమాన‌మంతా సినిమాలో క‌నిపిస్తుంద‌ని ఇప్ప‌టికే రివీల్ చేసారు. ఈ నేప‌థ్యంలో ఆగ‌స్టు 22న మెగా అభిమానులకు బిగ్ ట్రీట్ షురూ చేస్తుంద‌ని ఆశ‌తో వెయిట్ చేస్తున్నారు. మ‌రోవైపు మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో 'భోళాశంక‌ర్' చిత్రాన్ని కూడా ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఇలా చిరంజీవి 15 ఏళ్ల త‌ర్వాత ఒకేసారి మూడు సినిమాలు చేయ‌డం ఇదే కావ‌డం విశేషం.

కెరీర్ ఆరంభంలో చాలా సినిమాల‌కు ప‌నిచేసారు. ఆ త‌ర్వాత 2015 లో మూడు సినిమాలు ఒకేసారి చేసారు. మ‌ళ్లీ 66 ఏళ్ల వ‌య‌సులో అదే ఎనర్జీతో సినిమాలు చేయ‌డం పున ప్రారంభించారు. మ‌రి వీట‌న్నింటి ప్ర‌త్యేక‌తల న‌డుమ చిరంజీవి బ‌ర్త్ డే ట్రీట్ అభిమానులు ఆశించిన విధంగా ఉంటుంద‌ని ఇండ‌స్ర్టీ వ‌ర్గాలు సైతం భావిస్తున్నాయి. మ‌రి అభిమానులు ఆఆశ‌లు.అంచ‌నాలు నిమ‌వ్వాల‌ని ఆశిద్దాం.