Begin typing your search above and press return to search.

‘లూసీఫర్‌’ రీమేక్‌ చేతులు మారుతుందా?

By:  Tupaki Desk   |   18 July 2020 12:00 PM IST
‘లూసీఫర్‌’ రీమేక్‌ చేతులు మారుతుందా?
X
మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ ‘లూసీఫర్‌’ ను తెలుగులో చిరంజీవి హీరోగా రీమేక్‌ చేయబోతున్న విషయం తెల్సిందే. చిరంజీవి స్టార్‌ డంకు లూసీఫర్‌ చిత్రం బాగా సెట్‌ అవుతుందనే అభిప్రాయంను అంతా వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి కూడా చాలా రీమేక్‌ విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నట్లుగా మెగా వర్గాల ద్వారా తెలుస్తోంది. సాహో దర్శకుడు సుజీత్‌ దర్శకత్వంలో ఈ రీమేక్‌ ను చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. గత కొన్ని నెలలుగా సుజీత్‌ రీమేక్‌ కు సంబంధించి స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నాడనే ప్రచారం జరిగింది.

ఇటీవల రీమేక్‌ స్క్రిప్ట్‌ ను చిరంజీవికి సుజీత్‌ వినిపించాడట. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేర్పులు సూచించగా సుజీత్‌ తీవ్రంగా నిరాశపర్చాడంట. చిరంజీవి ఏమాత్రం సంతృప్తి చెందక పోవడంతో పాటు రీమేక్‌ బాధ్యతలను మరో దర్శకుడికి అప్పగించే ఉద్దేశ్యంతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. రీమేక్స్‌ ను హ్యాండిల్‌ చేయడంలో మంచి పట్టు ఉన్న ఒక ప్రముఖ దర్శకుడికి ఈ రీమేక్‌ బాధ్యతలు అప్పగించబోతున్నారట.

లూసీఫర్‌ రీమేక్‌ చేతులు మారిన విషయంపై ఇప్పటి వరకు బయటకు ఎలాంటి లీక్‌ రాలేదు. కాని మెగా వర్గాలు మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్‌ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆ దర్శకుడికి ఈ విషయమై సమాచారం అందించారట. అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆ దర్శకుడికి ఇది బంపర్‌ ఆఫర్‌ గా చెప్పుకోవచ్చు. చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న ఆచార్య పూర్తి అయిన తర్వాత ఈ రీమేక్‌ ను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.