Begin typing your search above and press return to search.

ఆచార్యగా మెగాస్టార్ - అధ్యాపకుడుగా పవర్ స్టార్..?

By:  Tupaki Desk   |   21 May 2021 7:30 AM GMT
ఆచార్యగా మెగాస్టార్ - అధ్యాపకుడుగా పవర్ స్టార్..?
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ హరీష్ శంకర్.. రూట్ వేరని నిరూపించుకున్నాడు. మాస్ కమర్షియల్ సినిమాలు తీయడంలో హరీష్ తనకంటూ సపరేట్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే 9ఏళ్ల క్రితమే హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో 'గబ్బర్ సింగ్' సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఆ మూవీతోనే హరీష్ శంకర్ ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. కానీ అదే సినిమాతో పవర్ స్టార్ కూడా ఫామ్ లోకి వచ్చాడు. అయితే అలాంటి ఇండస్ట్రీ హిట్ హరీష్ మళ్లీ ఇప్పటివరకు కొట్టలేదు. చివరిగా వరుణ్ తేజ్ హీరోగా 'గద్దలకొండగణేష్' తెరకెక్కించి హిట్ అందుకున్నాడు. అయితే మరోసారి పవన్ కళ్యాణ్ తో హరీష్ సినిమా రానున్న సంగతి విదితమే. ఈసారి ఖచ్చితంగా గబ్బర్ సింగ్ మూవీకి డబుల్ హిట్ అందుకోవాలనే పక్కా ప్రణాళికలో ఉన్నారు.

అలాగే పవన్ కళ్యాణ్ కోసం మంచి మాస్ స్క్రిప్ట్ సిద్ధం చేశారట. పవన్ - హరీష్ కాంబోలో సినిమా రాబోతుందంటేనే అభిమానులలో అంచనాలు ఓ రేంజిలో నెలకొంది. అయితే పవన్ నుండి ఫ్యాన్స్ ఎక్సపెక్ట్ చేస్తుంది కూడా గబ్బర్ సింగ్ లాంటి మాస్ ఎంటర్టైనర్ మూవీనే. అలాగే ఫ్యాన్స్ అంచనాలు అందుకునే విధంగా హరీష్ శంకర్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడని టాక్. తాజా సమాచారం ప్రకారం.. మళ్లీ పదేళ్లకు అదే వేసవిలో వీరి కాంబో మూవీతో పలకరించేందుకు రంగం సిద్ధం అవుతోందట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ ఇదివరకే రిలీజ్ చేశారు. సర్దార్ పటేల్ తో పాటుగా సుభాష్ చంద్రబోస్ లను చూపించి పెద్దబాలశిక్ష పుస్తకంతో గులాబీ - స్టైలిష్ బైక్ చూపించి మంచి బజ్ క్రియేట్ చేసాడు హరీష్. ఈ సినిమాలో వినోదంతో పాటు సందేశం కూడా ఉండబోతుందట.

తాజాగా పవన్ తో సినిమాకు సంబంధించిన స్క్రీన్ టెస్ట్ పూర్తి చేసాడట హరీష్. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించి ఓ లుక్ కూడా ఫైనల్ చేశారట. అయితే ఈ సినిమా పరిస్థితి సానుకూలంగా ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తారని టాక్. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అధ్యాపకుడుగా కనిపించనున్నట్లు సమాచారం. పవన్ తో కాలేజీ లెక్చరర్ రోల్ చేయించాలని హరీష్ ఎప్పటినుండో ప్లాన్ చేసాడట. నిజానికి మిరపకాయ్ సినిమా కూడా పవన్ దృష్టిలో పెట్టుకొని రాసుకున్నదేనట. కానీ అందులో రవితేజ నటించి సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తో లెక్చరర్ రోల్ చేయించడానికి ఆల్రెడీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఓ కాలేజీ సెట్ కూడా వేసినట్లు తెలుస్తుంది. మరి షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కానీ సినిమా పై అంచనాలు మాత్రం భారీగానే క్రియేట్ అయ్యాయి. ప్రస్తుతం పవన్ హరిహరవీరమల్లు - ఏకే రీమేక్ సినిమాలు చేస్తున్నాడు.