Begin typing your search above and press return to search.

కరోనాతో తేజూ న్యూ మూవీ ప్లాన్‌ చేంజ్‌

By:  Tupaki Desk   |   15 July 2020 2:20 PM IST
కరోనాతో తేజూ న్యూ మూవీ ప్లాన్‌ చేంజ్‌
X
మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సోబెటర్‌’ చిత్రం విడుదలకు సిద్దం అయిన సమయంలో కరోనా కారణంగా నిలిచి పోయిన విషయం తెల్సిందే. ఆ సినిమా పూర్తి అవ్వడంతో దేవా కట్ట దర్శకత్వంలో ఒక భారీ చిత్రాన్ని చేసేందుకు ఓకే చెప్పాడు. ఇప్పటికే ఆ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత సినిమాను విడుదల మొదలు పెట్టేందుకు దర్శకుడు దేవా కట్టా ఎదురు చూస్తున్నాడు. ఈ సమయంలోనే తేజ్‌ మరో సినిమాకు కమిట్‌ అయ్యాడని తెలుస్తోంది.

కొత్త దర్శకుడు గోపాల్‌ చెప్పిన ‘భగవద్గీత సాక్షిగా’ అనే స్క్రిప్ట్‌ తో తేజ్‌ సినిమా చేయబోతున్నాడట. ఇటీవలే చిరంజీవి కూడా ఆ స్క్రిప్ట్‌ విని తేజ్‌ కు కథ బాగుంటుందని చిన్న చిన్న మార్పులు సూచించాడట. ఆ మార్పులు పూర్తి చేసే పనిలో ఉన్న గోపాల్‌ ఈ ఏడాదిలోనే సినిమా షూటింగ్‌ ను మొదలు పెట్టాలనుకుంటున్నాడట. లిమిటెడ్‌ బడ్జెట్‌ సినిమా అవ్వడంతో పాటు భారీ కాస్టింగ్‌ అండ్‌ క్రూ అవసరం లేదు కనుక దేవ కట్టా మూవీ కంటే ముందే ఈ సినిమాను చేయాలనే నిర్ణయానికి తేజ్‌ వచ్చాడట.

భగవద్గీత సాక్షిగా చిత్రం పూర్తి అయిన తర్వాతే దేవ కట్టా మూవీ ఉంటుందని మెగా వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. మెగా హీరోలు ఎవరు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షూటింగ్స్‌ కు వెళ్లే సాహసం చేయడం లేదు. నబంబర్‌ డిసెంబర్‌ వరకు షూటింగ్‌ లు మొదలు అయ్యే అవకాశం కూడా కనిపించడం లేదు. తేజూ కూడా అప్పటి వరకు భగవద్గీత సాక్షిగా మొదలు పెట్టే అవకాశం లేదని అంటున్నారు. వచ్చే ఏడాదిలో సోలో బ్రతుకే సో బెటర్‌ చిత్రంతో పాటు భగవద్గీత సాక్షిగా విడుదల అయ్యే అవకాశం ఉంది. దేవ కట్టా సినిమా 2022లో విడుదల కావచ్చు అంటున్నారు.