Begin typing your search above and press return to search.

పునీత్ అకాల మరణానికి అదే కారణం

By:  Tupaki Desk   |   18 Nov 2021 5:30 AM GMT
పునీత్ అకాల మరణానికి అదే కారణం
X
హైదరాబాదు 'లాల్ బంగ్లా'లో నిన్న 'యోధ లైఫ్ లైన్ డయాగ్న స్టిక్స్' ప్రారంభోత్సవం జరిగింది. కంచర్ల సుధాకర్ వ్యవస్థాపకులుగా ఏర్పాటు చేసిన ఈ డయాగ్నస్టిక్స్ ప్రారంభోత్సవానికి వెంకయ్యనాయుడు .. తలసాని శ్రీనివాస యాదవ్ .. హరీశ్ రావు .. చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేదికపై చిరంజీవి మాట్లాడుతూ "సుధాకర్ వంటి యంగ్ స్టర్స్ ఎక్కడో విదేశాల్లో ఉన్న ఫెసిలిటీస్ ను ఇక్కడికి తీసుకురావడం నిజంగా గొప్ప విషయం. అందుకు మనందరం కూడా ఆయనను మనస్ఫూర్తిగా అభినందించాలి. నిజంగా ఇది ఒక మంచి ప్రయత్నం.

ఈ మధ్య వీటి అవేర్నెస్ బాగా పెరిగిపోయింది. చాలామంది తమ ఆరోగ్యం విషయంలో నెగ్లెట్ చేస్తూ ఉంటారు. అలా చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది. లేటెస్ట్ గా మా సినిమాలకి సంబంధించిన మిత్రులు ఒకాయన ఉన్నారు .. పేరు పునీత్ రాజ్ కుమార్. ఆ ఫ్యామిలీలో రాజ్ కుమార్ గారు హార్ట్ ఎటాక్ తో పోయారు. ఆయన పెద్ద కుమారుడికి కూడా హార్ట్ సమస్యనే .. ఏంజియోతో బయటపడి ఇప్పుడు బాగానే ఉన్నారు. రెండవ కుమారుడికి కూడా హార్ట్ ఎండ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మొత్తంమీదే ఇబ్బందికరంగానే బ్రతుకుతున్నారు.

పునీత్ రాజ్ కుమార్ కి మంచి ఫిజిక్ ఉంది .. ఫిట్ నెస్ ఉంది. మంచి ఆహారపు అలవాట్లు ఉన్నాయి .. ఎలాంటి బ్యాడ్ హాబిట్స్ లేవు. నాకు రాదులే అనుకున్నాడు. కానీ ఈ జీన్స్ లో .. వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందనే విషయం తెలిస్తే, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుని ఉండేవాడు. ఏ మాత్రం చెస్ట్ లో ఇబ్బంది ఉన్నా ముందుగా హాస్పిటల్ కి వెళ్లడం గాని చేసి ఉండేవారు. అకాల మరణం నుంచి ఆయన తప్పించుకుని ఉండేవారేమో అనిపిస్తోంది. అలాంటి అవకాశం .. అవగాహన లేకపోవడం వలన చాలా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడమనేది ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది.

పునీత్ రాజ్ కుమార్ కి అలా జరగడం నిజంగా చాలా దురదృష్టం. అలాంటి పరిస్థితి ఎవరికీ కూడా రాకూడదు. అందువలన అందుబాటులో ఉన్న ఈ టెక్నాలజీని అంతా ఉపయోగించుకోవాలి. ఈ టెక్నాలజీ వలన అన్నీ కూడా మనకి ముందుగానే తెలుస్తాయి. జబ్బు వచ్చిన తరువాత సఫర్ కావడం కంటే .. ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది. ఇలాంటి ఫెసిలిటీ మనకి దగ్గరలో .. మనకి అందుబాటులోకి రావడం గొప్ప విషయం. దీనిని అందరం ఉపయోగించుకుందాం .. ఆరోగ్యవంతులుగా ఉందాం" అని చెప్పుకొచ్చారు.