Begin typing your search above and press return to search.

మెగాస్టార్ 152 .. హీరోయిన్ గా కుర్ర‌బ్యూటీ

By:  Tupaki Desk   |   21 March 2020 5:30 AM GMT
మెగాస్టార్ 152 .. హీరోయిన్ గా కుర్ర‌బ్యూటీ
X
ర‌ష్మిక మంద‌న కెరీర్ స్పీడ్ గురించి తెలిసిందే. కెరీర్ ప్రారంభించిన కేవ‌లం నాలుగైదేళ్ల‌లోనే టాప్ హీరోయిన్ గా దూసుకెళుతోంది. వ‌రుస‌గా అగ్ర హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు అందుకుంటూ బాప్ రే అనిపించేస్తోంది. ప్ర‌తిభ‌కు అదృష్టం తోడైతే ఎలా ఉంటుందో ఈ కుర్ర‌బ్యూటీని చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

ఇప్ప‌టికే మ‌హేష్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించేసింది. `స‌రిలేరు నీకెవ్వ‌రు` సంక్రాంతి హిట్ చిత్రంగా నిలిచింది. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ స‌ర‌స‌న సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో జాక్ పాట్ కొట్టేసింది. నెక్ట్స్ ఎవ‌రు? అంటే... ఈసారి ఏకంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న అవ‌కాశం అందుకుంది ర‌ష్మిక‌. అది కూడా ఒకే సినిమాలో ఇద్ద‌రు టాప్ స్టార్ల‌తో స్క్రీన్ ని షేర్ చేసుకోబోతోంది.

మెగాస్టార్ చిరంజీవి - మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న తాజా చిత్రంలో ర‌ష్మిక మంద‌న ఒక క‌థానాయిక‌గా ఫైన‌ల్ అయ్యింది. చిరు 152లో చ‌ర‌ణ్ స‌ర‌స‌న ర‌ష్మిక క‌థానాయిక అయితే బావుంటుంద‌ని కొర‌టాల శివ భావించార‌ట‌. ఇప్ప‌టికే ర‌ష్మిక‌ను ఫైన‌ల్ చేశార‌ని తెలుస్తోంది. ఇక చిరు స‌ర‌స‌న క‌థానాయికగా కాజ‌ల్ లేదా అనుష్క‌ల్లో ఎవ‌రో ఒక‌రు న‌టిస్తార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఈ చిత్రానికి ఆచార్య అనే టైటిల్ ని చిరు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కొర‌టాల ఈ సినిమాని శ‌ర‌వేగంగా పూర్తి చేయ‌నున్నారు.

ఇప్ప‌టికే 30 కాల్షీట్ల‌కు గాను.. చ‌ర‌ణ్ కి రోజుకు కోటి పారితోషికం చొప్పున ఫిక్స్ చేశార‌ట‌. ఇక ఈ సినిమాని మ్యాట్నీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ తో క‌లిసి చ‌ర‌ణ్ స్వ‌యంగా నిర్మిస్తున్నారు. ఇక ర‌ష్మిక మంద‌న‌ను చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఫిక్స్ చేశారు కాబ‌ట్టి పారితోషికం రేంజ్ పెద్ద‌గానే ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న న‌టించినందుకు కోటిన్న‌ర వ‌ర‌కూ డిమాండ్ చేసింద‌ని అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. మ‌రి చెర్రీ స‌ర‌స‌న ఏ మేర‌కు వ‌సూల్ చేస్తోంది? అన్న‌ది చూడాలి.