Begin typing your search above and press return to search.

మెగాప‌వ‌ర్ స్టార్ కోసం ధూమ్ త‌ర‌హా స్టోరీనా?

By:  Tupaki Desk   |   17 Sep 2022 12:30 AM GMT
మెగాప‌వ‌ర్ స్టార్ కోసం ధూమ్ త‌ర‌హా స్టోరీనా?
X
'ఆర్ ఆర్ ఆర్' స‌క్సెస్ తో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ రేంజ్ పాన్ ఇండియాని దాటింది. చ‌ర‌ణ్ సీతారామ‌రాజు పాత్రకి హాలీవుడ్ మేక‌ర్స్ సైతం ఫిదా అయ్యారు. మెగా ప‌వ‌ర్ స్టార్ ని హాలీవుడ్ సైతం ఎర్ర తివాచీ వేసి ఆహ్వానించింది. ఒక్క హిట్ తోనే ఇంత‌టి ఘ‌న‌కీర్తిని సొంతం చేసుకున్న ఏకైక స్టార్ ఖ్యాతికెక్కారు. ఈ నేప‌థ్యంలో చ‌ర‌ణ్ ఐడియాలిజంలో సైతం ఎన్నో మార్ప‌సులు క‌నిపిస్తున్నాయి.

ప్ర‌స్తుతం ఆర్ సీ 15కి దేశం గ‌ర్వించ ద‌గ్గ ద‌ర్శ‌కుడు శంక‌ర్ ప‌నిచేస్తోన్న‌ సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈ సినిమా స‌గానికిపై గా షూట్ పూర్తిచేసుకుంది. బ్యాలెన్స్ ప‌నులు పూర్తిచేసి వ‌చ్చే ఏడాది సినిమా రిలీజ్ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో చ‌ర‌ణ్ త‌దుప‌రి ప్రాజెక్ట్ ఏదై ఉంటుంద‌న్న ఎగ్జైట్ మెంట్ అప్పుడే అభిమానుల్లో మొద‌లైంది.

'జెర్సీ' ఫేం గౌత‌మ్ తిన్న‌నూరితో చేయాల్సిన సినిమా విష‌యంలో స‌స్పెన్స్ కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియాలో ఫేమ‌స్ అయిన చ‌ర‌ణ్ ఇప్పుడ‌త‌నితో రిస్క్ తీసుకుంటాడా? అన్న సందేహాలు ఓవైపు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో కొత్త ద‌ర్శ‌కుడి పేరు తెర‌పైకి వ‌స్తుంది. అత‌నెవ‌రో కాదు యంగ్ మేక‌ర్ సుజిత్.

ఇప్పుడీ యంగ్ మేక‌ర్ చ‌ర‌ణ్ కోసం అదిరిపోయే యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ స్ర్కిప్ట్ సిద్దం చేస్తున్న‌ట్లు లీకులందాయి. చ‌ర‌ణ్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ ధూమ్ త‌ర‌హా క‌థ‌ని రెడీ చేస్తున్న‌ట్లు గుస గుస వినిపిస్తుంది. ఇటీవ‌లే చ‌ర‌ణ్ ని క‌లిసి లైన్ వినిపంచారుట‌. న‌చ్చ‌డంతో స్ర్కిప్ట్ సిద్దం చేయ‌మ‌ని గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

'ర‌న్ రాజా ర‌న్' సినిమాతో సుజిత్ ద‌త‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. ఆ వెంట‌నే యంగ్ డైరెక్ట‌ర్ ట్యాలెంట్ మెచ్చి ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ సాహోకి ప‌నిచేసే అవకాశం క‌ల్పించారు. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమా వాటిని అందుకోవ‌డంలో త‌డ‌బ‌డింది గానీ.. మేకింగ్ ప‌రంగా సుజిత్ ఎక్క‌డా ఫెయిల్ అవ్వ‌లేదు.

చిన్న వ‌య‌సులో అద్భుత‌మైన మేకింగ్ తో ఆక‌ట్టుకున్న‌ట్లు ప్ర‌శంస‌లందుకున్నాడు. టెక్నిక‌ల్ గా సినిమాల‌పై సుజిత్ కి మంచి గ్రిప్ ఉంద‌ని ప్రూవ్ చేసుకున్నాడు. హిందీ బెల్ట్ లో సినిమా బాగానే వ‌సూళ్లు సాధించింది. ఇవ‌న్నీ బేరీజు వేసుకునే చ‌ర‌ణ్ అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు ఓ వార్త వినిపిస్తుంది. మ‌రి ఇందులో వాస్త‌వం ఎంత‌న్న‌ది తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ శంక‌ర్ సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.