Begin typing your search above and press return to search.

మెగాపవర్ స్టార్ కామన్ డీపీ రెడీ చేసిన ఫ్యాన్స్ నెట్టింట వైరల్!

By:  Tupaki Desk   |   24 March 2021 10:00 PM IST
మెగాపవర్ స్టార్ కామన్ డీపీ రెడీ చేసిన ఫ్యాన్స్ నెట్టింట వైరల్!
X
మెగాపవర్ స్టార్ రాంచరణ్ పుట్టినరోజు ఏర్పాట్లకు సర్వం సిద్ధం అవుతోంది. మార్చ్ 27న రాంచరణ్ పుట్టినరోజు ఉండటంతో అభిమానులు పండగ వాతావరణం క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మాములుగా ఫేవరేట్ హీరోల సినిమాలు విడుదల అయితేనే హంగామా చేసే ఫ్యాన్స్.. ఇప్పుడు పుట్టినరోజు వేడుకలు అంటే ఏ రేంజిలో హంగామా చేస్తారో ఊహించుకోలేం. తాజాగా రాంచరణ్ పుట్టినరోజుకు సంబంధించిన కామన్ డీపీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగాపవర్ స్టార్ అని పిలుచుకుంటారు కాబట్టి.. బ్యాక్ గ్రౌండ్ లో బిగ్ స్టార్ ఒకటి సెట్ చేశారు. సీడీపీలో రాంచరణ్ ఎవడు సినిమాలో ధరించిన డ్రెస్ తో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.

బ్లూ కలర్ ఓపెన్ షర్ట్ తో, జేబులో చేతులు పెట్టుకొని రాంచరణ్ ఎవడు సినిమా బీచ్ సాంగ్ పిక్ తో డిజైన్ చేశారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఆ పిక్ వైరల్ అవుతోంది. మార్చ్ 26న శిల్పకళా వేదికలో గ్రాండ్ బర్త్ డే పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకలకు మెగాఫ్యామిలీ మెంబర్లు కూడా హాజరు అవుతారని టాక్. వీరితో పాటు ఆచార్య మేకర్స్, ఆర్ఆర్ఆర్ మేకర్స్ కూడా సందడి చేయనున్నట్లు తెలుస్తుంది. రాంచరణ్ ఈ పుట్టినరోజుతో తన 36వ యేట అడుగుపెట్టనున్నాడు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రాంచరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే చివరి దశలో ఉన్న ఈ సినిమాలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నాడు. అలాగే ఆచార్య సినిమాలో చరణ్ సిద్ధ అనే పాత్రలో నటించాడు. ఈ రెండు సినిమాలు ఇదే ఏడాది విడుదల కాబోతున్నాయి.