Begin typing your search above and press return to search.

డిఫరెంట్ సినిమాలతో 'సక్సెస్ ట్రాక్' ఎక్కిన మెగాహీరో..!!

By:  Tupaki Desk   |   19 Jan 2021 4:30 PM GMT
డిఫరెంట్ సినిమాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన మెగాహీరో..!!
X
మెగా ఫ్యామిలీ హీరోలలో విజయవంతంగా కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నాడు వరుణ్ తేజ్.. లోఫర్ మిస్టర్ సినిమాల తర్వాత సినిమాల ఎంపిక విషయంలో కాస్త ఆలోచించి అడుగులు వేస్తున్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే తొలిప్రేమ, ఎఫ్2, ఫిదా, గద్దలకొండ గణేష్ సినిమాలతో పాటు ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటున్న గని సినిమాలను గమనిస్తే ఈజీగా అర్ధమవుతుంది. కథల ఎంపిక విషయంలో వరుణ్ ఎంత జాగ్రత్త పడుతున్నాడో అనేది. ఇప్పుడిప్పుడే వరుణ్ తన సినీజర్నీని ఒక దారిలో సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ముకుంద సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వరుణ్.. ఆ తర్వాత కంచె సినిమాతో ఫస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమాలో వరుణ్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. అయితే ఎంత మెగా ఫ్యామిలీ నుండి వచ్చినా సినిమాలు, నటన పరంగా ఫెయిల్ అయితే ఎవరూ ఏమి చేయలేరు. అందుకే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంటున్నాడు వరుణ్. అందుకే సినిమాల విషయంలో వేరియేషన్స్ చూపిస్తున్నాడు.

ఈరోజు వరుణ్ పుట్టినరోజు. ఈ సందర్బంగా వరుణ్ చేస్తున్న కొత్త సినిమా టైటిల్, మోషన్ పోస్టర్ విడుదల చేసింది చిత్రబృందం. ఇక బాక్సింగ్ నేపథ్యంలో సాగనున్న ఈ సినిమాతో నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇంతకుముందు అంతరిక్షం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కిరణ్.. ఆ సినిమా టైంలోనే ఈ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ కథ చెప్పి ఒప్పించినట్లు సమాచారం. ఇక బాక్సింగ్ నేపథ్యంలో సాగే స్టోరీ కాబట్టి వరుణ్ ఇప్పటికే విదేశాలకు వెళ్లి బాక్సింగ్ లో శిక్షణ కూడా తీసుకున్నాడు. వరుణ్ అన్నివిధాలా అంటే శారీరకంగా బాక్సర్ గా కనిపించడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడని మోషన్ పోస్టర్ లోనే చూపించేశారు. ఇక ఈ సినిమాను అల్లు బాబీ, ముద్ద సిద్ధులు నిర్మిస్తున్నారు. వరుణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ సయిమంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం వరుణ్ చేతిలో మరో సినిమా కూడా ఉంది. అదే ఎఫ్3. ఎఫ్2 మూవీకి సీక్వెల్ గా రూపొందుతుంది ఎఫ్3. ఆ సినిమాలో వెంకటేష్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు వరుణ్. చూడాలి మరి తన సక్సెస్ ఫామ్ కొనసాగిస్తాడేమో!