Begin typing your search above and press return to search.

క్రీడానేపథ్యంలో మెగాహీరో కొత్త సినిమా..?

By:  Tupaki Desk   |   17 May 2021 11:30 AM GMT
క్రీడానేపథ్యంలో మెగాహీరో కొత్త సినిమా..?
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉప్పెన లాంటి మంచి హిట్ సినిమాతో డెబ్యూ చేసిన మెగాహీరో పంజా వైష్ణవ్ తేజ్. మొదటి సినిమానే హిట్టు పడేసరికి మెగాహీరోకు తీరిక లేకుండా సినిమాలు ఆఫర్స్ వస్తున్నాయట. అదేవిధంగా వైష్ణవ్ కూడా ఇప్పుడే వరుసగా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టేస్తున్నాడు. ఇప్పటికే సెకండ్ మూవీ కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ కొండపోలం మూవీ పూర్తి చేసాడు. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకొని విడుదలకు సిద్ధం అవుతోంది. ఓ ప్రముఖ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగనుంది.

అలాగే వైష్ణవ్ చేయబోయే మూడో సినిమా గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. వైష్ణవ్ తన మూడో సినిమాను తమిళ 'ఆదిత్యవర్మ' ఫేమ్ గిరీషయ్య దర్శకత్వంలో చేయనున్నాడు. ఇప్పటికే సినిమా ప్రీప్రొడక్షన్ పనులతో సిద్ధం అవుతోందట. ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నాడు. త్వరలో షూటింగ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. ఇలా మూడో సినిమా లైన్ లో ఉండగానే వైష్ణవ్ నాలుగో సినిమా అలా చర్చల్లో నిలిచింది. వైష్ణవ్ నాలుగో సినిమా కింగ్ నాగార్జున ఓన్ ప్రొడక్షన్ హౌస్ అన్నపూర్ణ బ్యానర్ లో తెరకెక్కనుంది.

ఐతే ఈ సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాలలో పలు ఇంటరెస్టింగ్ అప్డేట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమా రెగ్యులర్ సినిమాలా కాకుండా చాలా డిఫరెంట్ గా ఉండబోతుందట. ఎందుకంటే కెరీర్ ప్రారంభంలోనే వైష్ణవ్ మంచి కాన్సెప్ట్ లతో ముందుకు వెళ్తున్నాడు. అన్నపూర్ణ బ్యానర్ లో చేయబోయే సినిమా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనుందని సమాచారం. ఈ సినిమాతో పృథ్వీ అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాను దర్శకుడు హాకీ గేమ్ నేపథ్యంలో ప్లాన్ చేశారట. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుందని టాక్. హాకీ ప్లేయర్ లుక్ కోసం వైష్ణవ్ శారీరకంగా సిద్ధం అవుతున్నాడని సినీవర్గాలు చెబుతున్నాయి.