Begin typing your search above and press return to search.
మెగాఫ్యామిలీ అల్లుడు మెల్లగా బిజీ హీరో అవుతున్నాడుగా..!
By: Tupaki Desk | 12 Feb 2021 11:00 PM ISTటాలీవుడ్ మెగాస్టార్ చిరు చిన్నకూతురు శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ పుట్టినరోజును మెగాఫ్యామిలీ ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా మెగాఅల్లుడి పుట్టినరోజున కొత్త సర్ప్రైజులు చాలానే ఇచ్చారు మెగాఫ్యామిలీ అండ్ తనతో సినిమాలు చేస్తున్న మేకర్స్. ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ పుట్టినరోజు సెలెబ్రేషన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కళ్యాణ్ దేవ్ భార్య శ్రీజ ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో భర్తతో కలిసి శ్రీజ ఎంతో ఆనందంగా ఉన్నట్లు అర్ధమవుతుంది. ఆ ఫోటోతో పాటు ‘‘ప్రియాతి ప్రియమైన కళ్యాణ్ దేవ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. నా జీవితాంతం నా ప్రాణస్నేహితుడితో జీవించే అదృష్టం దొరికింది చాలు’’ అంటూ ఆమె రాసుకొచ్చింది. ఆమెతో పాటు మెగా అభిమానులు కూడా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇదిలా ఉండగా.. కళ్యాణ్ దేవ్ - శ్రీజల పెళ్లి 2016లో జరిగింది. ఈ దంపతులకు 2018 డిసెంబర్‌లో నవిష్క జన్మించింది. అంతకు ముందు శ్రీజకు కుమార్తె నివృతి ఉంది. ప్రస్తుతం నివృతి కూడా శ్రీజ, దేవ్ లతోనే ఉంటోంది. కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం తనని తను హీరోగా ప్రూవ్ చేసుకునేందుకు తెగ కష్టపడుతున్నాడు. ‘విజేత’ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన కళ్యాణ్.. ఇప్పుడు ‘సూపర్ మచ్చి’ అనే కమర్షియల్ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఎస్ఆర్టి ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌లో ‘కిన్నెరసాని’ అనే సినిమా చేస్తుండగా.. వారు ఈరోజు కళ్యాణ్ దేవ్ పుట్టినరోజు సందర్బంగా మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఇదేగాక శ్రీధర్ సీపాన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ హీరోగా బిజీ అవుతున్నాడు. మొత్తానికి మెగాఫ్యామిలీ అల్లుడి బర్త్ డేను సెలెబ్రేట్ చేసి హ్యాపీ చేశారు.