Begin typing your search above and press return to search.

జూనియ‌ర్ ఎన్టీఆర్ పై మెగాబ్ర‌ద‌ర్‌ నాగ‌బాబు సంచ‌ల‌న కామెంట్!

By:  Tupaki Desk   |   20 March 2021 1:30 AM GMT
జూనియ‌ర్ ఎన్టీఆర్ పై మెగాబ్ర‌ద‌ర్‌ నాగ‌బాబు సంచ‌ల‌న కామెంట్!
X
మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడిగా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యమైన నాగ‌బాబు.. ఆ త‌ర్వాత న‌టుడిగా, నిర్మాత‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. బుల్లితెర‌పై సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన నాగ‌బాబు.. జ‌బ‌ర్ద‌స్త్ షోతో ఆడియ‌న్స్ ను అల‌రించారు. ఈ క్ర‌మంలోనే యూట్యూబ్ చాన‌ల్ ర‌న్ చేస్తున్న ఆయ‌న‌.. నా ఛాన‌ల్.. నా ఇష్టం అంటూ ఏ విష‌యం మీద‌నైనా త‌న అభిప్రాయాన్ని క్లియ‌ర్ క‌ట్ గా చెప్పేస్తున్నారు.

అంతేకాదు.. ఖుషీ ఖుషీగా అనే ఓ కామెడీ షోను కూడా త‌న ‌యూట్యూబ్ చాన‌ల్ లో మొద‌లు పెట్టారు. జ‌బ‌ర్ద‌స్త్ మాదిరిగానే ఇందులోనూ కామెడీ స్కిట్స్ చేసి ఆడియ‌న్స్ ను న‌వ్విస్తున్నారు కంటిస్టెంట్లు. ఇదే యూట్యూబ్ ఛాన‌ల్ లో త‌మ ఫ్యామిలీ విష‌యాలు, త‌న ప‌ర్స‌నల్‌, సినిమాల‌ టాపిక్స్ కూడా డిస్క‌స్ చేస్తున్నారు నాగ‌బాబు.

కాగా.. ఇటీవ‌ల త‌న ఇన్ స్టా అకౌంట్ ద్వారా ఫ్యాన్స్ తో లైవ్ చాట్ నిర్వ‌హించారు నాగ‌బాబు. ఈ చాట్ లో పాల్గొన్న ఫ్యాన్స్‌.. నాగ‌బాబును ఎన్నో ప్ర‌శ్న‌లు వేశారు. వారందరికీ ఓపిగ్గా స‌మాధానాలు చెప్పారు. అయితే.. ఓ నెటిజ‌న్ జూనియ‌ర్ ఎన్టీఆర్ గురించి ప్ర‌శ్న వేశారు. వీర రాఘ‌వ గురించి చెప్పు నార‌పరెడ్డి అని అన్నాడు. దీనికి అనూహ్య‌మైన కామెంట్ చేశారు నాగ‌బాబు.

'ఈత‌రం న‌టుల్లో టార్చ్ బేర‌ర్‌' అంటూ సమాధానం చెప్పారు మెగాబ్రదర్. ఈ కామెంట్ చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఇండ‌స్ట్రీలో మెగా-నంద‌మూరి ఫ్యామిలీల గురించి ఏవేవో డిస్క‌ష‌న్స్ న‌డిచేవి. కానీ.. కాల‌క్ర‌మంలో అవ‌న్నీ ప‌టాపంచ‌లైపోతున్నాయి. ఎప్ప‌టి నుంచో స్నేహితులుగా మెలుగుతున్న‌ రామ్ చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టిస్తూ మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు. ఇప్పుడు నాగ‌బాబు కూడా ఇంత పాజిటివ్ కామెంట్ చేయ‌డం అభిమానుల‌ను ఆనందంలో ముచ్చెత్తింది.